కృష్ణ వంశీకి నచ్చనిదిదే..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ.. తను అనుకున్న స్టోరీను తెర మీద ఆవిష్కరించే తీరు అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆయనను క్రియేటివ్ డైరెక్టర్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమా వస్తుందంటే అంటే యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. కానీ కొంతకాలం నుండి కృష్ణవంశీ నుండి చెప్పుకోదగిన సినిమాలే రాలేదు.

మునుపటి వంశీనిచూడాలని …..

అయితే ఈ నేపథ్యంలో ఓ అభిమాని కృష్ణవంశీకి ట్విట్టర్ ఇలా ట్వీట్ పెట్టాడు… ‘మీ సినిమాలంటే మాకు చాలా ఇష్టం.. మాకు మళ్లీ మునుపటి కృష్ణవంశీని చూడాలని వుంది సార్ .. ఒక హిట్ సినిమా తీయండి సార్’ అంటూ ఆ అభిమాని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

నా కిష్టం ఉండదన్న……

అందుకు కృష్ణ వంశీ.. ‘హిట్ సినిమాలు..ప్లాప్ సినిమాలు ఉండవ్. ప్రేక్షకులు కనెక్ట్ అయితే హిట్ అవుతుంది..కనెక్ట్ కాకపోతే ప్లాప్ అవుతాయి’ అని ఆయన అన్నారు. ‘ఖడ్గం’ లాంటి సినిమాను మళ్లీ మీనుండి ఆశించొచ్చా అని మరో అభిమాని ట్వీట్ చేశాడు. ‘ఒకేలా ఉన్న సినిమాలు మళ్లీ మళ్లీ చేయడం నాకు ఇష్టం ఉండదు…ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలనే ఆలోచిస్తాను’ అని ఆయన సమాధానమిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*