‘కృష్ణార్జున యుద్ధం’ ఆడలేదు బాబాయ్: నాని

nani jercy movie copied from hollywood movie

టాలీవుడ్ లో హీరో నాని చాలా జెన్యూన్ అని సినీ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులతో పాటు బయట జనాలకి కూడా తెలుసు. తన సినిమాలు తాను చేసుకుంటూ ఎవరి జోలికి పోకుండా ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కోటింది. నాని గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా అంతగా ఆడలేదు.

నానికి ఫిదా అయిన నెటిజన్లు..

అసలు విషయం ఏంటంటే.. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను యూట్యూబ్ లో ఓ ఛానల్ వాళ్లు పెట్టారు. అయితే ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని సూపర్ హిట్ అంటూ ప్రస్తావించగా నాని అందుకు బదులిస్తూ.. సూపర్ అంట.. అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా. ఐనా మేము మనసు పెట్టి ఈ సినిమా చేశాం..మీరు చూసేయండి’ అని సరదాగా సమాధానం ఇచ్చి అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. నాని జోవియల్ పర్సన్ అని తెలుసు కానీ మరీ ఇంత జోవియల్ అనుకోలేదని సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కాళీ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను లేటెస్ట్ గా ‘మహానటి’ సినిమాతో కం బ్యాక్ అయిన అశ్విని దత్ నిర్మిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*