కేటీఆర్ వల్లే ‘c/o కంచరపాలెం’కు ఆ అవకాశం!

ktr help to c/o kancharapalem

తక్కువ బడ్జెట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది ‘కేరాఫ్ కంచరపాలెం’. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసాడు. గత ఏడాది రిలీజ్ అయినా ఈ సినిమాను అమెరికా పౌరసత్వం ఉన్నవారు నిర్మించారన్న కారణంతో జాతీయ అవార్డుల బరిలో నిలిచేందుకు అర్హత లేదంటూ అవార్డుల కమిటీ ప్రకటించింది. దీంతో ఈ మూవీకి అలా నేషనల్ అవార్డు మిస్ అయిందని అంతా అనుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నిర్మాత ప్రవీణ చెప్పడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలో కి దిగారు.

కేటీఆర్ ట్వీట్ చేయడంతో…

కేంద్రమంత్రి రాజ్ వర్ధన్ సింగ్ రాథోడ్ కి ట్వీట్ చేసి ఈ చిత్రాన్ని జాతీయ అవార్డులకు అర్హత కల్పించాలని కోరారు. కేటీఆర్ కోరడంతో కేంద్రమంత్రి స్వయంగా అధికారులతో మాట్లాడారు. అయితే, నిర్మాత లేదా సహ నిర్మాత అయినా భారతీయులు ఉండాలని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. దీంతో ఈ సినిమా సహ నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ వారు ఉండటంతో వారు దరఖాస్తు చేసుకుంటే అర్హత లభిస్తుందని అధికారులు కేంద్రమంత్రి కి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన కేటీఆర్ కి చెప్పడంతో పాటు అధికారులను నిర్మాతలతో మాట్లాడించారు. దీంతో తమకు సహకరించిన కేటీఆర్ కు, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కి నిర్మత ప్రవీణ పరుచూరి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలుపారు. అలా కేటీఆర్ వల్ల ఈ సినిమా నేషనల్ అవార్డు లిస్ట్ లో చేరింది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*