లక్ష్మీపార్వతి పాత్రలో సీనియర్ నటి..!
నందమూరి బాలకృష్ణ గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంపై బాలకృష్ణ మొదటి నుండి అంచనాలు పెట్టుకున్నారు. ఆయన అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా డైరెక్టర్ క్రిష్ పని చేస్తున్నాడు. రోజురోజుకి ఈ సినిమాలో నటించే నటీనటులని చూస్తే ఈ సినిమా ఏ లెవెల్ లో చిత్రీకరిస్తున్నారో అర్థం అవుతుంది.
ఇష్టం లేకున్నా పెడుతున్నారా..?
ఈ చిత్రంలో చాలామంది ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక తాజాగా ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మి పార్వతి పాత్ర పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. లక్ష్మి పార్వతి అంటే నందమూరి ఫామిలీ ఇష్టం ఉండదు. ఆమెకి కూడా ఈ ఫామిలీ అంటే ఇష్టముండదు. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఉండదు అనే అనుకున్నారు అంతా. అయితే ఆమె లేకుండా సినిమాను తెరకెక్కిస్తే ప్రేక్షకులు సినిమాను తిరస్కరించే అవకాశం ఉండనే ఉద్దేశంతో ఇప్పుడు ఆమె పాత్రను ఎంపిక చేశారు.
లక్ష్మీపార్వతిగా ఆమని
లక్ష్మి పార్వతి పాత్రలో సీనియర్ నటి ఆమనిని ఎంపిక చేసారంట చిత్ర యూనిట్. ప్రస్తుతం ఆమె క్యారక్టర్ ఆర్టిస్ట్ గా వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. లక్ష్మి పార్వతి పాత్ర ఆమని అయితే పూర్తి న్యాయం చేస్తుందని డైరెక్టర్ క్రిష్ భావిస్తున్నాడట. మరి ఆమె పాత్ర ఇందులో ఎలా చూపిస్తారో చూడాలి.