శ్రీరెడ్డికి లారెన్స్ బంపర్ ఆఫర్

క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటి శ్రీరెడ్డికి తమిళ డైరెక్టర్ రాఘవ లారెన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీరెడ్డి ఇటీవల పలువురు కోలీవుడ్ దర్శకులు, నటులపై కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ పైన కూడా ఆమె ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన లారెన్స్… ఏడేళ్ల క్రితం రెబల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీరెడ్డి తనను కలిసిందని, ఒకవేళ తన తప్పు ఏమైనా ఉంటే ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తన హోటల్ రూంకి వచ్చినట్లు శ్రీరెడ్డి చెబుతుందని, రూంలో దేవుళ్ల పోటోలు రుద్రాక్ష మాల ఉన్నాయని చెబుతుందని, తాను హోటల్ రూంలో రుద్రాక్ష మాల పెట్టి, దేవుళ్లకు పూజలు చేసేంత ఫూల్ ని కాదన్నారు.

టాలెంట్ ఉంటే మంచి పాత్ర ఇస్తా…

తాను మహిళలకు అమితంగా గౌరవం ఇస్తానని, అందుకే తన తల్లికి గుడి కట్టించి మహిళలకు అంకితం చేశానని లారెన్స్ గుర్తుచేశారు. శ్రీరెడ్డికి తన చిత్రంలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ముందు ప్రెస్ మీట్ పెట్టి, అందరి ముందు ఒక సీన్, కొన్ని సులువైన డ్యాన్స్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తానని, ఒకవేళ ఆమెకు టాలెంట్ ఉంటే కచ్చితంగా తన తర్వాతి చిత్రంలో మంచి పాత్ర ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తానన్నారు. తన సినిమాలో నటించడం ద్వారా మరిన్ని అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అందరి ముందు నటించడానికి ఇష్టపడకపోతే, ఒక లాయర్ ను, ఆమె శ్రేయోభిలాషులను తీసుకువచ్చైనా నటించి చూపిస్తే చాలని స్పష్టం చేశారు. అయితే, ఇది శ్రీరెడ్డికి భయపడి చెప్పడం లేదని, ఒక మహిళగా ఆమెను గౌరవిస్తూ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1