వాళ్లు వేదించారు…

ఇటీవల టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎంత కలకలం సృష్టించాయో తెలిసిందే. దేశవ్యాప్తంగా టాలీవుడ్ పరువుని బజారున పడేశాయి ఈ ఆరోపణలు. ముఖ్యంగా నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పి పోరాడింది. అయితే, శ్రీరెడ్డి పోరాటం చేసే అంశం కంటే కూడా పోరాడే పద్ధతి పైనే చర్చ ఎక్కువగా జరగడంతో అసలు విషయం పక్కకు వెళ్లిపోయింది. తాజాగా అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాలకు లిరిక్ రైటర్ గా మంచి పేరు సంపాదించిన శ్రేష్ఠ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేదింపులు ఎదుర్కొన్నానని ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఓ టాలీవుడ్ నిర్మాత భార్యే ఆమె భర్త లైంగిక కోరిక తీర్చమని అడిగిందని శ్రేష్థ ఆరోపించారు. మరో ఘటనలో తనకు ప్రపోజ్ చేయడానికి ఓ వ్యక్తి గోవాలో పార్టీ ఏర్పాటు చేశాడని, ఈ పార్టీకి కచ్చితంగా రావాలని ఓ మహిళా డైరెక్టర్ వేదించిందని, తాను ఒప్పుకోకపోతే బెదిరించిందని ఆరోపించారు. దీంతో తాను కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. కేవలం టాలెంట్ తో మాత్రమే పేరు సంపాదించలేనని అనేకమంది తనకు ఉచిత సలహాలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కేవలం మగవారే కాదని, ఆడవారు ఈ కింద ఈ వేదింపులకు పాల్పడటం దారుణమన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*