చిరు కి కోపమొచ్చింది… మహేష్ సైడయ్యాడు!

ఈ మధ్యన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో తరుచూ వివాదాలు రేగుతున్నాయి. శ్రీ రెడ్డి ఇష్యూ అప్పుడు బాగా డ్యామేజ్ అయిన ‘మా’ పరువు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో చెలరేగిన విభేదాలతో రోడ్డున పడింది. ‘మా’ అధ్యక్షుడి మీద నిధుల గోల్ మాల్ వివాదం చెలరేగడం.. దానికి ‘మా’ కార్యదర్శి నరేష్ మద్దతు పలకడంతో ఈ వివాదం ప్రస్తుతం పీక్స్ లో ఉంది. అయితే నిధుల గోల్ మాల్ వ్యవహారంలో శివాజీరాజా వర్గం హ్యాండ్ ఉందని నరేష్ వర్గం వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదంలో చిరు పేరు తెరమీదకి రావడం.. అది విన్న చిరంజీవి హార్ట్ అయినట్లుగా వార్తలు రావడం.. అలాగే సీనియర్ నరేష్ చిరు వద్దకు ఈ నిధుల గోల్ మాల్ ‘మా’ పంచాయితి తీసుకెళ్లగా.. ఆయన సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని మాట ఇచ్చారని ప్రచారం జరుగుతున్న టైం లోనే ఇప్పుడు మహేష్ బాబు కూడా ‘మా’ వ్యవహారంలో తల దూర్చాడు.

వివాదంలోకి లాగొద్దన్న నమ్రత

అయితే సమస్యను పరిష్కరించడానికి మాత్రం కాదు కానీ… మహేష్ పాల్గొనాల్సిన అమెరికా ఈవెంట్ ని మహేష్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఈ వ్యవహారం బయటికెలా వచ్చిందంటే.. ‘మా’ సభ్యుడైన బెనర్జీ మహేష్ భార్య నమ్రత వద్దకు వెళ్లి మీరైనా జోక్యం చేసుకోవాలని కోరడం… దానికి మహేష్ భార్య నమ్రత ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడమే కాదు… నమ్రత అమెరికాలో మహేష్ బాబు పాల్గొనే ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించిందనే న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో నడుస్తుంది. ఇలాంటి వివాదంలోకి మమ్మల్ని లాగొద్దని ఆమె సున్నితంగా చెప్పినట్టుగా సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*