మహేష్ ఆలోచన బాగానే ఉంది

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు నటుడు గానే కాకుండా వ్యాపారాలు..యాడ్ ఫిల్మ్ లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు వంటివి చేస్తుంటాడు అని తెలిసిన విషయమే. రీసెంట్ గా అయన ‘ఎంబి’ అనే బ్యానర్ స్టార్ట్ చేసి అందులో సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ బ్యానర్ లో తన సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా తెరకెక్కించాలని మహేష్ ప్లాన్ అంట.

అయితే మహేష్ తన సినిమాల్లో బిజీగా అయిపోతాడు కాబట్టి ఆ పనులు తన భార్య నమ్రత చూసుకుంటుందంట. ఇక పై చిన్న సినిమాలు, డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నారట. సరైన కథలు..కాస్త ప్రామిసింగ్ గా వుండే చిన్న డైరక్టర్ల కోసం చూస్తున్నారు. రెండు మూడు కోట్లు లోపు అయిపోయే సినిమాలను తెరకెక్కించాలని ప్లాన్ అంట. అందు కోసం డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉంది. రీసెంట్ గా వచ్చిన ఆర్ఎక్స్ 100, యుటర్న్, చిలసౌ వంటి చిత్రాలు నమ్రతకి బాగా నచ్చడంతో వారితో సినిమాలు చేయాలనీ చూస్తుందట.

వీరికి సపోర్ట్ గా..అల్లు అరవింద్..దిల్ రాజు..యూవీ క్రియేషన్స్ వారు ఉన్నారు. పైగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు అయిన ఏషియన్, దిల్ రాజు వంటి వారితో మంచి సంబంధాలు వున్నాయి. సో అన్ని సరిగా ప్లాన్ చేసుకుంటే ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వొచ్చు. ప్రస్తుతం నమ్రత కొంతమంది దర్శకులు చెప్పే కథలు వింటున్నట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*