మహానటి జోరు తగ్గుతుందా..?

మహానటి విడుదలై దాదాపుగా 22 రోజులు కావొస్తుంది. సినిమా విడుదలైన ఇన్ని రోజులకి కూడా మహానటి కలెక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ అయినట్లుగా కనబడడం లేదు. అయితే మహానటి సత్తా ఏమిటనేది ఈ శుక్రవారం నుండి తెలుస్తుంది. ఈ శుక్రవారం రామ్ గోపాల్ వర్మ – నాగార్జున ఆఫీసర్, రాజ్ తరుణ్ రాజుగాడు, విశాల్ – సమంత ల అభిమన్యుడు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేశాయి. మరి ఈ సినిమాల్లో ఒకే ఒక్క సినిమా టాక్ బాగుంది. ఆఫీసర్, రాజుగాడు సినిమాలకు ఫ్లాప్ టాక్ రాగా. విశాల్ అభిమన్యుడు సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి అభిమన్యుడు సినిమాని తట్టుకుని మహానటి సినిమా ఇంకెంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాల్సి ఉండగా.. ఈ 22 రోజులు మహానటి కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా…

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 10.71
ఉత్తరాంధ్ర 3.40
సీడెడ్ 2.54
కృష్ణ 2.11
గుంటూరు 1.86
ఈస్ట్ గోదావరి 1.82
వెస్ట్ గోదావరి 1.29
నెల్లూరు 0.67
ఏపీ మరియు టీఎస్ షేర్స్: 24.40 కోట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*