మహానటితో ప్రమాదం ముంచుకొచ్చింది

ప్రస్తుతం ఈ రోజు బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి మూవీ మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మహానటి మూవీ ని క్రిటిక్స్ మొత్తం భారీ మార్కులతో పాస్ చేసేసారు. ఒక్క సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథను వెండితెర మీద మహానటి గా అద్భుతంగా ఆవిష్కరించాడని సినీ పరిశ్రమ లోని పలువురు నాగ్ అశ్విన్ ని అభినందిస్తున్నారు. ఈ సినిమాకి ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా నూటికి 99 మార్కులు వేసేసారు. మహానటి ఈ లెక్కన సూపర్ హిట్ లక్షణాలు అద్భుతంగా కనబడుతున్నాయి. మరి మహానటి మూవీ తో ఇప్పుడు ప్రమాదంలో పడింది ఎవరో తెలుసా.. అల్లు అర్జున్ నా పేరు సూర్య.

అల్లు అర్జున్ నా పేరు సూర్య విడుదలై ఈ రోజుకి ఐదు రోజులు కావొస్తుంది. టాక్ యావరేజ్ గా ఉండడంతో నా పేరు సూర్య కలెక్షన్స్ కూడా సో సో గానే ఉన్నాయి. మరి నా పేరు సూర్య మీద హైప్ తీసుకురావడానికి అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని వాడుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. రేపు జరగబోయే నా పేరు సూర్య సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గెస్ట్. మరి మహానటిని లైట్ తీసుకుని నా పేరు సూర్య కలెక్షన్స్ మీద పవన్ స్టామినాని ప్రయోగిద్దామంటే.. అది కుదిరేలా కనబడడం లేదు. మహానటి టాక్ యావరేజ్ గా వున్నా అల్లు అర్జున్ సేఫ్ అయ్యేవాడు. కానీ మహానటి టాక్ అదిరింది. మరి ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇరుకున పడ్డట్టే.

ఇక మహానటి విజయం సాధించడంతో.. అశ్వినీదత్ శిబిరంలో సంతోషం నెలకొంది. అశ్వినీదత్ కూతుళ్లు ప్రియా, స్వప్న దత్ లు మహానటి మూవీ ని ఎంతో ధైర్యంగా నిర్మించారు. ఇప్పుడు వారి ధైర్యమే వారికీ రక్ష అయ్యింది. నిర్మాతగా బాగా దెబ్బతిన్న అశ్వినీదత్ ని ఆయన అల్లుడు నాగ్ అశ్విన్, కూతుళ్లు కలిపి మళ్ళీ నిలబెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*