మహానటిలో క్రిష్,అవసరాల పాత్రలు ఏంటో తెలుసా?

ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరోగా న్యాచురల్ స్టార్ నానిని పెట్టి తీసి పర్లేదు అనిపించుకున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు తన రెండో చిత్రంగా ‘మహానటి’ ఈనెల 9న మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు.. తమిళ్ లో రిలీజ్ కు సిద్ధం అయింది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర చేయగా.. సమంత జర్నలిస్ట్ మధురవాణిగా..అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య.. ఫొటోగ్రాఫర్‌ విజయ్‌అంటోనిగా విజయ్‌ దేవరకొండ..దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ గా నటిస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే టీజర్స్ ద్వారా చిత్ర బృందం బయట పెట్టింది.

ఎస్వీరంగరావు పాత్రలో…

అంతే కాకుండా ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారని తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఎల్వీ ప్రసాద్‌ పాత్రలో..అలనాటి దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఆ సినిమా వీడియో రూపంలో విడుదల చేసారు చిత్ర బృందం. ఎల్వీ ప్రసాద్‌ పాత్రలో నటుడు అవసరాల శ్రీనివాస్‌ నటిస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ ని చిత్ర సీమకు పరిచయం చేసింది ఎల్వీ ప్రసాదే. మహానటి సావిత్రితో ‘పెళ్లి చేసి చూడు’, ‘మిస్సమ్మ’ వంటి చిత్రాలు తీసి మన అందరి గుండెల్లో కూర్చోపెట్టారు. ఇటాంటి గొప్ప పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా? మన అవసరాల శ్రీనివాస్‌ అంటూ యంగ్‌ హీరో నాని తన వాయిస్‌ని ఈ వీడియోకి జోడించాడు.

కేవీరెడ్డి పాత్రలో…..

అలానే మరో వీడియోలో టీవీ.. ఇంటర్నెట్..కంప్యూటర్స్ ఉన్న ఈరోజుల్లో ఏదైనా చేయొచ్చు బట్ 65 ఏళ్ళ క్రితం ఇవేమి లేనప్పుడు.. ‘మాయ బజార్’ లో లాప్ టాప్ విత్ స్కైప్ ని ఆరోజుల్లో ప్రియదర్శినిగా చూపించిన ఒక అతను ఉన్నాడు ఆయనే కేవీ రెడ్డి గారు. మరి కేవీ రెడ్డి గారి పాత్ర ఎవరు పోషించారో తెలుసా? మన క్రిష్ జాగర్లమూడి అంటూ నాని వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ రెండు వీడియోస్ మేకర్స్ రిలీజ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*