మహానటి కి కూడ అదే సమస్య

రేపు విడుదలకు రెడీ అవుతున్న ‘మహానటి’ సినిమాకి సంబంధించి ప్రొమోషన్స్ జరగడం లేదు అన్న మాట వాస్తవమే. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇంతవరకు రిలీజ్ కూడా చేయలేదు. పెద్దగా ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి సినిమా మీద కాన్ఫిడెన్సా లేక టీజర్ లో సీన్స్ కాకుండా ఒక సీన్ బయటికి వచ్చిన సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వస్తాయి కాబట్టి వాటికి ఆస్కారం ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు.

ఏదిఏమైనా రేపే ఈ సినిమా రెజుల్ట్ తెలుసుపోనుంది. సినిమాపై ఎంత కాంఫిడెన్స్ ఉన్న ప్రొమోషన్స్ చేసుకోకపోతే దీని ప్రభావం ఓపెనింగ్స్ మీద పడుతోంది. ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రావు. దాంతో వీక్ డేస్ లో ఈ సినిమాకు వెళ్లే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇక నిన్న ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.

రన్ టైం వచ్చేప్పటికి మొత్తం 176 నిముషాలు. 3 గంటల నిడివికి జస్ట్ 4 నిముషాలు తక్కువ అంతే. డైరెక్టర్ నాగ అశ్విన్ మహానటి ప్రయాణాన్ని కట్ షార్ట్ చేయలేదని అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాలు దాదాపు లెంగ్త్ ఎక్కువ ఉన్న సినిమాలే. రీసెంట్ గా ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ మూడు గంటలు ఉన్నా విసిగించకుండా బ్లాక్ బస్టర్ కాగా ‘నా పేరు సూర్య’ రెండు ముప్పాతికతో పర్వాలేదు అనిపించుకునే రేంజ్ లో సాగుతోంది. అదే కాంఫిడెన్స్ తో డైరెక్టర్ ఎక్కడ సినిమాలో కట్స్ చేయకుండా మూడు గంటలు సినిమాను మనకి చూపించాలనుకుంటున్నాడేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*