మహానటిపై మెగా హీరో ప్రశంసల జల్లు

Keerti Suresh upcoming movies

కీర్తి సురేష్ సావిత్రి రోల్ లో నటించిన మహానటి మూవీ విడుదలై అప్పుడే నెల గడుస్తుంది. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ని పరిశ్రమలోని ప్రతి ఒక్కరు పొగడడమే కాదు.. మెగాస్టార్ చిరు, అల్లు అర్జున్ వంటి వారు ఇంటికి పిలిచి మరీ ఏకంగా మహానటి టీమ్ ని సత్కరించారు కూడా. ఇక ప్రతి ఒక్కరు సావిత్రి రోల్ లో మెప్పించిన కీర్తి సురేష్ ని ఆకాశానికెత్తేశారు. సినిమాని మహాద్భుతంగా తీర్చిద్దిన నాగ్ అశ్విన్ ని వెయ్యినోళ్ల పొగిడారు. చిన్నా లేదు పెద్దా లేదు ప్రతి ఒక్క స్టార్ కూడా మహానటిని పొగిడినవారే కానీ పొగడని వారు లేరు. అయితే కాస్త లెట్ గా అంటే సినిమా విడుదలైన ఒక నెలకి మహానటి టీమ్ ని తెగ పొగిడేస్తున్నాడు మెగా హీరో రామ్ చరణ్.

హృదయానికి హత్తుకుంది…

కాస్త ఆలస్యంగా రామ్ చరణ్ స్పందించడానికి కారణం.. ఆయన బిజీ షెడ్యూల్. అందు వల్లే మహానటిని లేట్ గా వీక్షించిన రామ్ చరణ్ మహానటి టీమ్ ని సోషల్ మీడియాలో తెగ పొగిడేసాడు. మహానటి సినిమా త‌న మ‌న‌సుకు హ‌త్తుకుంద‌ని… త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మహానటి సినిమా నా మనసుకు హ‌త్తుకుంది. సాటి న‌టుడిగా ఆ సినిమా నాపై చెర‌గ‌ని ముద్ర వేసింది. ఆ మ‌హాన‌టి పాత్ర‌ను ఎంతో అంకితభావంతో, ప్రేమ‌తో, గౌర‌వంతో తీర్చిదిద్దిన‌ నాగ్ అశ్విన్ కు హ్యాట్స్ ఆఫ్. మ‌హాన‌టిగా కీర్తి సురేశ్ న‌ట‌న అద్భుతం. ఆ పాత్రకు కీర్తి సురేశ్ త‌ప్ప మ‌రెవ‌రూ న్యాయం చేయ‌లేరు. ఇంకా ఆ సినిమాలో నటించిన సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ల నటన కూడా ఎంతో సహజంగా వుంది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇంతగొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలకి శుభాకాంక్షలు..’ అంటూ మహానటిపై తన మనసులోని భావాలని సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*