వెండితెర మీదే కాదు… బుల్లితెర మీద కూడా..!

ఎటువంటి అంచనాలు లేకుండా మీడియం బడ్జెట్ తో తెరకెక్కి అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన నాగ్ అశ్విన్ మహానటి మూవీ వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా బంపర్ హిట్ అయ్యింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాని కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అదరగొట్టే మేకింగ్ స్టయిల్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ కూతుళ్లు 22 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా అనుకోని పెద్ద హిట్ అవడం… అప్పుల్లో ఉన్న వైజయంతి మూవీస్ ని లాభాల బాట పట్టించింది. సినిమా విడుదలయ్యాక కూడా మంచి ప్రమోషన్స్ తో మహానటి టీమ్ సినిమా మీద అందరిలో ఆసక్తిని కి క్రియేట్ చేసింది.

రెండింతలు లాభాలు…

వెండితెర మీద చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టిన మహానటికి పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభాలు తెచ్చింది. వసూళ్లపరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఈ సినిమా 100 రోజులు ఆడడమే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ కున్న రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా నటించి మెప్పించింది. మహానటి తో కీర్తి సురేష్ క్రేజ్ తెలుగు, తమిళంలోనూ మరింత ఎక్కువైంది. ఇక ఈ మహానటి సినిమా వెండితెర మీద మాత్రమే కాదు బుల్లితెర మీద కూడా మహానటి దూసుకుపోయింది.

బుల్లితెర పైనా జోరు…

ఈ సినిమా స్టార్ మా టివి లో ప్రసారం అయ్యింది. మహానటి మూవీ స్టార్ మా టివి లో ప్రసారం అయిన రోజు స్టార్ మా ఛానల్ టిఆర్పి రేటింగ్స్ ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఏకంగా మహానటి ప్రసారం అయిన ఆ రోజు స్టార్ మా 20.16 టీఆర్పీని రాబట్టి తన ప్రత్యేకతను చాటుకుంది. వెండితెర మీదే కాకుండా బుల్లితెరపై కూడా మహానటి సినిమాకు ఈ స్థాయి ఆదరణ రావడం పట్ల మహానటి సినిమా టీమ్ చాలా హ్యాపీగా ఫీలవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*