వైరల్ గా మారిన మహానటి డిలీటెడ్ సీన్లు

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ పావిత్రి జీవితాన్ని వెండితరపై ఆవిష్కరించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. అయితే, సినిమా నిడివి కారణంగా తొలగించిన కొన్ని సన్నివేశాలను చిత్ర బృందం విడుదల చేస్తోంది. తాజా, విడుదల చేసిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు సావిత్రి జెమిని గణేషన్ మొదటి ఇద్దరు భార్యలను, వారి పిల్లలను ప్రేమగా చేసుకున్న విధానం ఈ సన్నివేశంలో కళ్లకు కట్టారు.

అందరినీ ఒక్కచోట చేర్చిన సావిత్రి…

సావిత్రి కూతురు విజయ, జెమిని రెండో భార్య పుష్పవల్లి కూతురు రేఖ, రాధా ఒకే స్కూల్లో చదువుతారు. రేఖ తన తండ్రి జెమిని గణేషన్ అని చెప్పడంతో సావిత్రి కూతురు విజయ వచ్చి సావిత్రికి చెబుతుంది. దీంతో రేఖ, రాధలపై జాలిపడిన సావిత్రి జెమిని గణేషన్ ను వారించి మరీ పుష్పవల్లిని, కూతుళ్లు రేఖ, రాధాలను ఇంటికి పిలిచి ప్రేమగా చూస్తుంది. ఈ సన్నివేశంలో జెమిని పెద్ద భార్య అలివేలు కూడా ఉంటుంది. అంటే ఈ సన్నివేశంలో గణేషన్ ముగ్గురు భార్యలు, పిల్లలు ఒక్కచోట కనపడతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*