ఈ వీకెండ్ మహానటిదే

ప్రస్తుతం థియేటర్స్ లో మహానటి జోరు మాములుగా లేదు. ఈ సినిమా వారం మధ్యలో విడుదలైంది కాబట్టి కలెక్షన్స్ ఓ అన్నంత లేవు గాని… ఈ శుక్రవారం నుండి మహానటి ప్రభంజనం బాక్సాఫీసు వద్ద కనబడనుంది. ఇప్పటికే మహానటి వీకెండ్ లో థియేటర్స్ అన్నీ ముందస్తు బుకింగ్స్ తో ఫుల్ల అయ్యాయి. మరి బుక్ మై షో లో మహానటి థియేటర్స్ లో కేవలం ఒకటో రెండో సీట్స్ మాత్రమే ఖాళీగా కనబడుతున్నాయి. కానీ అవి కూడా చాలా త్వరగానే ఫిల్ అవుతున్నాయి. మరి నా పేరు సూర్య జెండా ఎత్తెయ్యగా.. ఈ రోజు విడుదలవుతున్న మెహబూబా పరిస్థితి ఏమిటనేది సినిమా టాక్ మీద ఆధారపడివుంటుంది. మెహబూబా కి పాజిటివ్ టాక్ వచ్చినా మహానటి పెద్దగా లాస్ ఏం ఉండదు. ఎందుకంటే మహానటి మౌత్ టాక్ మాములుగా లేదు.

ఈలెక్కన రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత మళ్ళీ అంతటి స్థాయి హిట్ మహానటి అందుకుంది. అయితే మహానటి రంగస్థలం, భరత్ అనే నేను కి వచ్చిన కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా రావు. కానీ సినిమా కి మంచి టాక్ వచ్చి కావాల్సిన కలెక్షన్స్ అయితే వస్తాయి. మరి అశ్విని దత్ వాళ్ళు నాగ్ అశ్విన్ ని నమ్మి పెట్టుబడి పెట్టినందుకు మహానటితో మంచి హిట్ అందించాడు. మహానటి సినిమాని నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేసిన విధానానికి పలువురు ముగ్దులవుతున్నారు.

మరి ఈ వీకెండ్ లో మహానటి జోరు మాములుగా ఉండదని.. ఈ రోజు తమిళనాట కూడా విడుదలకబోతున్న మహానటి మూవీ తో కోట్లు వెనకేసుకోవడానికి ఆశ్వినిదత్ బ్యాచ్ రేడి అవుతుంది. ఇక ఓవర్సీస్ లోను మహానటి ప్రభంజనం ప్రీమియర్స్ తోనే మొదలైంది. ఇక అక్కడ కూడా ఈ వీకెండ్ లో మహానటి జోరు మాములుగా ఉండదంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*