‘మహర్షి’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

Disturbances between Maharshi producers

మహేష్ బాబు 25వ చిత్రంగా వస్తున్న ‘మహర్షి’ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో పూజ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో హీరోయిన్ ఉందని తెలుస్తుంది. మహేష్ ఇందులో 3 షేడ్స్ కనిపించనున్నాడు. స్టూడెంట్ గా, బిజినెస్ మెన్ గా, రైతు సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు పూజా తో రొమాన్స్ చేస్తే.. బిజినెస్ మెన్ గా ఉన్నప్పుడు సోనాల్ చౌహాన్ కి కనెక్ట్ అవుతాడట. మొదట సోనాల్ చౌహాన్ కి బదులు మెహ్రీన్ అనుకున్నారు కానీ ఏమైందో ఏంటో ఆమె ప్లేస్ లోకి సోనాల్ చౌహాన్ వచ్చింది.

అమెరికా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ కి

తొలిసారిగా సోనాల్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగు ఈమె ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘డిక్టేటర్’ లాంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా అమెరికా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే హైదరాబాద్ లో వేసే ఓ భారీ విలేజ్ సెట్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ కాకుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్ ముగ్గురు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*