ఫారిన్ చెక్కేస్తున్న మహర్షి టీం..!

మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్ 25వ సినిమా మహర్షి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లు నిర్మిస్తున్నారు. జులై నెలలో కాస్త లేట్ గా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టినా పరిగెత్తిస్తున్నారు. షూటింగ్ మొదలైనప్పుడు డెహ్రాడూన్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మహర్షి తర్వాతి షెడ్యూల్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

ఉగాది కానుకగా విడుదల

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని ఫారిన్ లో ప్లాన్ చేసింది వంశీ పైడిపల్లి బృందం. అమెరికా, న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ వేగాస్ లలో మహర్షి తదుపరి షెడ్యూల్ ని చెయ్యబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారమే ఫారిన్ షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కబోతుంది మహర్షి టీం. ఇక విదేశాల్లో ఏకధాటిగా రెండు నెలల పాటు మహర్షి షూటింగ్ ని జరపనున్నారు. ఆ షెడ్యూల్ లోనే సినిమాలోని అతి కీలక సన్నివేశాలతో పాటుగా మహేష్, పూజ హెగ్డే ల మీద రొమాంటిక్ సాంగ్స్ ని కూడా చిత్రీకరిస్తాని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5 న ఉగాది కానుకగా విడుదల కాబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*