మహర్షి షూటింగ్ కి ఐదు.. పోస్ట్ ప్రొడక్షన్ కి నాలుగు..!

మహర్షి సినిమా షూటింగ్ కి ఐదు.. పోస్ట్ ప్రొడక్షన్ కి నాలుగు అంటే ఇదేదో బడ్జెట్ అనుకునేరు. కాదు సినిమా షూటింగ్ కి ఐదు నెలలు టైం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఏకంగా షూటింగ్ అంత టైం అంటే దాదాపుగా నాలుగు నెలలు తీసుకోబోతుందట మహర్షి టీమ్. అందుకే మహర్షి సినిమా షూటింగ్ జులై నెల మధ్యలో మొదలు పెట్టినప్పటికీ.. షూటింగ్ ని యమ స్పీడు తో పరిగెత్తిస్తున్నారు. మహేష్ కూడా ఎటువంటి విరామం తీసుకోకుండా వంశీ పైడిపల్లికి ఫుల్ గా సహకరిస్తున్నాడు. అయితే సినిమా ఏప్రిల్ 5 న విడుదలవుతుంటే… ఈ ఏడాది చివరికల్లా.. మహర్షి సినిమా షూటింగ్ ని ఒక కొలిక్కి తెచ్చెయ్యడానికే ఈ స్పీడు తో మహర్షి షూటింగ్ ని కానిచ్చేస్తున్నారట.

బాలీవుడ్ తరహాలో…

మరి వచ్చే ఏడాది విడుదల కాబోయే సినిమాకి ఈ ఏడాది సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసి… మిగతా నాలుగు నెలల టైంని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మహర్షి టీం కేటాయించబోతున్నారట. ఇలా ఎక్కువగా బాలీవుడ్ సినిమాల విషయంలో చూస్తూ ఉంటాం. బాలీవుడ్ లో బడా ప్రాజెక్టులను తెరకెక్కించే షూటింగ్ టైం కన్నా ఎక్కువగా… సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తారు. అందుకే ఇప్పుడు వంశీ కూడా మహర్షి మేకింగ్ విషయంలో బాలీవుడ్ తరహా మేకింగ్ నే ఫాలో అవ్వబోతున్నాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. సినిమా షూటింగ్ విషయంలో ఎంతగా పర్ఫెక్షన్ తో ఉంటారో… పోస్ట్ ప్రొడక్షన్ పనులను అంటే పర్ఫెక్షన్ తో చేపడతారు.

పొరపాట్లు జరగకుండా…

అందుకే వంశీ బాలీవుడ్ సినిమా స్టయిల్ మీద కన్నేసాడు. మహర్షి సినిమా షూటింగ్ ని ఎంత వీలయితే అంత తొందరగా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం మిగతా సమయం తీసుకుంటాడట. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక మహేష్ కెరీర్ లో మైలురాయిగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదనే వంశీ పైడిపల్లి ఇలా పోస్ట్ ప్రొడక్షన్ కోసమే నాలుగు నెలలు టైం తీసుకుని మేకింగ్ ని జాగ్రత్తగా పూర్తి చేసే యోచనలో ఉన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*