మహేష్ తో కొరటాల పదే… పదే..!

Mahesh babu starded new business

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ గా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ కోసం రెడీగా ఉంది. అందుకుగాను టీం మొత్తం వచ్చే నెల అమెరికాకి వెళ్లనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా చిత్రీకరించే అవకాశముంది. ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే.

కొరటాల శివతో యాడ్

ఇలా వరస సినిమాలు చేస్తూ మరో పక్క కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నాడు మహేష్. మహేష్ ఇప్పటివరకు చాలా యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని త్రివిక్రమ్ చేయగా మిగతావి బయట వ్యక్తులు చేశారు. అయితే ఇప్పుడు మహేష్ తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ తో ఓ కమర్షియల్ యాడ్ చేస్తున్నాడు. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల డైరెక్షన్ లో మహేష్ ఓ కమర్షియల్ యాడ్ చేస్తున్నట్లు తెలిసింది.

ఇంతకుముందు త్రివిక్రమ్ డైరెక్షన్ లో…

మహేష్ కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ కొరటాల డైరెక్షన్ లో అభిబస్ యాడ్ చేయనున్నాడు. త్వరలోనే ఆ యాడ్ ను కొరటాల శివ చిత్రీకరించనున్నారు. గతంలో అభిబస్ యాడ్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడే అదే కంపెనీకి సంబంధించి రెండో యాడ్ ని కొరటాల డైరెక్ట్ చేయనున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*