చిట్టి కోసం వెయిటింగ్ అంటున్న సూపర్ స్టార్..!

చిట్టి కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ వెయిటింగ్ ఏమిటా అనుకుంటున్నారా…? సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ కాదండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు 2.ఓ చిట్టిని వెండితెర మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా ట్వీట్ చేసాడు. 2.ఓ ట్రైలర్ గత శనివారం విడుదలైంది. భారీ విజువల్స్ తో కూడిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకునేలా ఉండడం… శంకర్ డైరెక్షన్, రజనీకాంత్ నటన, అక్షయ్ కుమార్ విలనిజం, అమీ జాక్సన్ అందంతో పాటుగా.. భారీ గాఫిక్స్ తో ఈ సినిమా మీద బోలెడన్ని అంచనాలున్నాయి.

ట్వీట్ చేసిన మహేష్ బాబు..

అయితే 2.ఓ ట్రైలర్ ని వీక్షించిన పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా అభినందిస్తే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే… విజువల్స్, కాన్సెప్ట్ అదిరిపోయాయి. చిట్టి చేసే విధ్వంసాన్ని స్క్రీన్‌ పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్, మీ టీమ్ మొత్తానికీ నా అభినందనలు.. అంటూ 2.ఓ సినిమా కోసం తనెంతగా వెయిట్ చేస్తున్నానో అనేది ట్వీట్ ద్వారా తెలియజేశాడు. మహేష్ లాంటి స్టార్ హీరో 2.ఓ గురించి ఇలా పాజిటివ్ గా మట్లాడడం అంటే ఆ సినిమా మీద క్రేజ్ మరింత పెరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*