మహేష్ ఇంట్లో సెలెబ్రేషన్స్

Mahesh babu telugu post telugu news

ఫ్యాన్స్ కు తమ హీరోస్ బర్త్ డేస్ అంటే వాళ్లకి పండగలాగా. వారి పుట్టినరోజున ఎదోకరకంగా సెలెబ్రేట్ చేసుకోవడం ఎన్టీఆర్..ఏఎన్ఆర్ టైం నుండే చూస్తున్నాం. ప్రస్తుతం ఆ ఫీవర్ మరింత ఎక్కువైందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో మహేష్ బాబు ఒకడు. ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ మహేష్ బర్త్ డేని ఎంతలా సెలెబ్రేట్ చేసుకుంటారో వేరే చెప్పనవసరంలేదు.

అదే విధంగా స్టార్ హీరోల పిల్లలు బర్త్ డేలు కూడా ఇంచుమించు అదేవిధంగా జరుపుకుంటుంటారు. మహేష్ కూడా సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నప్పటినుండే స్టార్ కిడ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే..ఈరోజు మహేష్ బాబు గారాలపట్టి అయిన సితార పుట్టినరోజు. ఈ పాపా పుట్టినరోజు మహేష్ ఫ్యామిలీయే కాదు తమ ఫ్యాన్స్ కూడా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక మహేష్ ఫ్యామిలీకి అయితే ఇది ఒక పెద్ద సెలబ్రేషనే కదా.. దాంతో కేక్ కట్ చేసి బర్త్ డే హంగామా చేశారు. దానికి సంబందించిన ఫొటోస్ కూడా బయటికి వచ్చాయి. ఆ కేక్ మీద మహేష్ ఫామిలీతో ఉన్న ఫోటో ఉంది. ఆ కేక్ కట్ చేసుకుని ఒకరిఒక్కరు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*