మహేష్.. కొరటాలకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు?

తన కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు కొరటాల ‘శ్రీమంతుడు’ తో హిట్ ఇచ్చాడు. అలానే మళ్లీ అదే పరిస్థితిలో ఉన్నప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అని చాలాసార్లు మహేష్ చెప్పాడు. ‘శ్రీమంతుడు’ సినిమాతో మొదలైన వీరి స్నేహం ‘భరత్ అనే నేను’ విజయంతో మరింత బలపడింది. కొరటాల శివ తెగ నచ్చేయడంతో ట్విట్టర్ లో కొరటాల శివకూ ఫాలోవర్ గా మారిపోయాడు మహేష్.

గిఫ్ట్ సస్పెన్స్…

‘శ్రీమంతుడు’ కంటే గొప్ప సినిమాను ఇచ్చిన కొరటాలకు మహేష్ ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడంట. అయితే ఆ గిఫ్ట్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. మాములుగా మన హీరోస్ డైరెక్టర్స్ కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ముందుగా వారికి గుర్తొచ్చేది కారు. అయితే మహేష్ కూడా కొరటాలకు కారు ఇచ్చాడా? లేదాబిల్డింగ్ కానీ ప్లాట్ కానీ ఇచ్చాడా? లేక బంగారం ఇచ్చాడా? అని అందరిలోను క్యూరియాసిటీగా మారింది.అయితే ఆ గిఫ్ట్ ను మీడియాకు తెలియకుండా దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ మహేష్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి ఆ గిఫ్ట్ ఏంటన్నది కొరటాల కానీ మహేష్ కానీ నోరు విప్పితేనే కానీ మనకి తెలియదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*