మహర్షి కోసం దిల్ రాజు స్కెచ్ వర్కౌట్ అవుతుందా?

maharshi movie issues

ఈమధ్యన తెలుగు స్టార్ హీరోల సినిమాలు హిందీ యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. అందుకే తెలుగు స్టార్ హీరోల సినిమాలు హిందీ హక్కులకు భారీ క్రేజ్ తోపాటుగా డిమాండ్ కూడా ఏర్పడుతుంది. అల్లు అర్జున్ సినిమాలకైతే హిందీ లో భారీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మూవీస్ హిందీ లో డబ్భై యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. అలాగే సమంత – నితిన్ ల అ… ఆ సినిమా కూడా హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇక తాజాగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాల మార్కెట్ మీద ఇప్పుడు హిందీ బడా నిర్మాణ సంస్థలు కన్నేశాయి. అందుకే ఇక్కడి దర్శకనిర్మాతలు కూడా హిందీ హక్కులకు భారీ ధర చెబుతున్నారు.

వంశి పైడిపల్లి – మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 వ మూవీ మహర్షి సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఫారిన్ షెడ్యూల్ కోసం రేడి అవుతున్న మహర్షి సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకును ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు . అశ్విని దత్, పివిపి తో కలిసి మహర్షి సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు, గత చిత్రాలు ప్లాప్ అవడంతో… ఇప్పుడు మహర్షి తో ఆ లెక్కలు సరి చెయ్యాలని.. దిల్ రాజు చూస్తున్నట్లుగా మహర్షికి చెబుతున్న రేట్లతో అర్ధమవుతుంది. ప్రస్తుతం మహర్షి అంచనాలు తగ్గట్టుగా హిందీ హక్కులకు గాను దిల్ రాజు భారీగా 25 కోట్లు కోట్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

మరి అంత అంటే 25 కోట్లతో మహర్షి హిందీ హక్కులను ఎవరు దక్కించుకుంటారో. ప్రస్తుతం మహర్షి హిందీ హక్కుల రేటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే బోయపాటి సినిమాలు హిందీ లో ఇప్పటివరకు భారీ రేటు పలుకుతూ వచ్చాయి. రామ్ చరణ్ తో బోయపాటి తెరకెక్కిస్తున్న RC12 కి కూడా 22 కోట్ల రేటు హిందీ హక్కులకు రేటు పలికింది. ఆ డీల్ కూడా క్లోజ్ అయ్యిందనే న్యూస్ ఉంది. మరి మహేష్ – వంశి చిత్రానికి 25 కోట్లు కోట్ చేస్తున్నారంటే.. బయట మహర్షికి మరింత క్రేజ్ రాబట్టే దిల్ రాజు ఇలా ప్లాన్ చేస్తున్నాడేమో కానీ.. దిల్ రాజు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*