మహేష్ కాఫీ కథ!!

ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ భరత్ కు ముందు తాను చాలా టెన్షన్ పడినట్లుగా భరత్ థాంక్స్ మీట్ లో మహేష్ బాబు మీడియా ముఖంగా తెలిపాడు. అయితే ఈ సినిమా విజయం తన తల్లి ఇందిర కు తానిచ్చిన బహుమతి అని అంటున్నాడు మహేష్. అసలు తన సినిమా భరత్ అనే నేను తన తల్లి ఇందిర పుట్టిన రోజు నాడు విడుదల కావడమే విశేషమని చెప్పిన మహేష్… సినిమా విడుదలకు ముందు తన తల్లి యవ్వనంలో ఉన్న అందమైన ఫోటో ని సోషల్ మీడియా లో షేర్ చేసాడు. తన తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే మహేష్ ఎప్పుడూ బయట ఆమె గురించి చెప్పిన సందర్భాలు లేవు.

తల్లిపోలిక అని….

మాములుగా మహేష్ ఫంక్షన్స్ కి కృష్ణ తన రెండో భార్య విజయ నిర్మలతో హాజరవడం… అక్కడ్ స్టేజ్ మీద ఎక్కువగా కృష్ణ గురించే మహేష్ స్పందించడం చేస్తుండేవాడు. కానీ ఇందిరా గురించి పెద్దగా స్పందించేవాడు కాదు. అయితే బయట ఫ్యామిలీ ఫంక్షన్స్ కి మాత్రం తన తల్లిని జాగ్రత్తగా తీసుకెళ్లడం చేస్తుండేవాడు. అలాగే తన కూతురు సితార తన తల్లి పోలిక అంటూ గర్వంగా చెప్పేవాడు. అయితే తాజాగా మహేష్ బాబు తన తల్లి గురించి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. తాను భరత్ అనే నేను సినిమా విడుదలకు ముందు తీవ్ర ఒత్తిడికి లోనై… ఆ ఒత్తిడి తట్టుకోలేక తన తల్లి దగ్గరికి వెళ్ళాడట.

అమ్మ చేతి కాఫీ తాగి…..

అలా వెళ్లిన మహేష్ తన తల్లిని ఒక కాఫీ కలిపి ఇవ్వమని చెప్పగా.. ఆవిడ తన చేత్తో కలిపిన కాఫీని కొడుక్కి ఇవ్వగా.. ఆ కాఫీ తాగిన మహేష్ కి ఒత్తిడి మొత్తం చేత్తో తీసేసినట్టుగా మాయమైందట. ఇక భరత్ విజయం సాధించడంతో తన తల్లి చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అలాగే తన తండ్రి కృష్ణ కూడా చాలా హ్యాపీ అని చెప్పిన మహేష్ తన తండ్రి సంతోషం కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుందని చెబుతున్నాడు ఈ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*