మహేష్ బాబు అదరగొట్టే లుక్..!

Mahesh babu posted photo in instagram

మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు. మహేష్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా మహేష్ ఫిట్ నెస్, బాడీ లాంగ్వేజ్, అందం, ఆకర్షణ… ఏదైనా సరే.. మహేష్ తర్వాతే అన్నట్టుగా ఉంటుంది. భరత్ అనే నేను లో యంగ్ అండ్ సూపర్ సీఎంగా అదరగొట్టిన మహేష్ బాబు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహర్షి మూవీ లో ఎంబీఏ స్టూడెంట్ గా స్టూడెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. జుట్టు పక్కకి దువ్వి, గళ్ళ చొక్కా వేసుకుని.. స్టూడెంట్ అంటే ఇలానే ఉంటాడనిపిస్తున్నాడు. స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో మహేష్ అదరగొడుతున్నాడు.

శరవేగంగా షూటింగ్

మహర్షి షూటింగ్ ఇప్పటివరకు డెహ్రాడూన్ లోని కాలేజ్ సెట్ లో, హైదరాబాదులో మరో షెడ్యూల్ పూర్తి చేసుకుని… ఫారిన్ షూటింగ్ కోసం పయనం కాబోతుంది. ఇక ఫారిన్ షూటింగ్ లో దాదాపుగా నెల రోజుల పాటు స్పెండ్ చేయబోతుంది మహర్షి టీం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నమహర్షి లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ఫారిన్ లొకేషన్స్ లో అమెరికా లోని కొన్ని నగరాల్లో పోష్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేలా రిచ్ లొకేషన్స్ ఎంపిక చేసుకుని ఆ లొకేషన్స్ లో మహర్హి లోని కీలక సన్నివేశాలను వంశి పైడిపల్లి చిత్రీకరించన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*