మహేష్ తో త్రివిక్రమ్ సినిమా లేనట్టేనా!!

ఎప్పటినుంచో మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి. మహేష్ 26వ చిత్రం త్రివిక్రమ్ తో కన్ ఫర్మ్ అని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ప్రస్తుతం ఇద్దరు వేరువేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్లన ఈ సినిమా కొంచం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని అనుకున్నారు అంతా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాలని ప్లాన్ చేసింది.

వెనక్కి తగ్గిందా?

అయితే ఇప్పుడు ఆ సంస్థ ఆ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అజ్ఞాతవాసి ఫలితం తర్వాత త్రివిక్రమ్ కి అంత క్రేజ్ ఉండకపోవొచ్చని..అందుకే వేరే దర్శకుడు కోసం ఆ సంస్థ చూస్తుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రంగస్థలం సినిమాతో సుకుమార్‌తో మంచి ర్యాపో కుదిరింది కనుక అతడితోనే ఈ ప్రాజెక్ట్‌ చేయాలనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ వుందని టాక్‌ గెట్టిగా వినిపిస్తుంది.

సుకుమార్ తోనేనా?

అయితే సుకుమార్..మహేష్ ఇద్దరు ఒక్క మాట కూడా అనుకోలేదు. కానీ ‘1 నేనొక్కడినే’ ప్లాప్ అయ్యినప్పుడు మహేష్ తో ఇంకో సినిమా చేసి సక్సెస్ అందిస్తానని మాటిచ్చాడు సుకుమార్. రంగస్థలం ఇంటర్వ్యూ టైంలో సుకుమార్.. మహేష్ తో చేయాలనీ అది నా బాధ్యత కచ్చితంగా టైం కుదిరితే చేస్తా అని చెప్పాడు. ఒకవేళ ఆ కాంబినేషన్ సెట్ అయితే సెట్స్ మీదకి వెళ్ళటానికి చాలానే టైం పడుతుంది.