అందుకే అంత సస్పెన్స్ లో పెడుతున్నారా?

dil raju comments on f2 sequel

మహేష్ బాబు – వంశి పైడిపల్లి ల కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 వ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లోనూ, అక్కడి ఒక కాలేజ్ లోను శరవేగంగా జరుపుకుంటుంది. మహేష్ బాబు హీరోయిన్ పూజ హెగ్డే, ఈ సినిమాలో మరో మెయిన్ కేరెక్టర్ రోల్ చేస్తున్న అల్లరి నరేష్ లపై కీలక సన్నివేశాలను అంటే… కాలేజ్ సన్నివేశాలను వంశి పైడిపల్లి గత పది రోజులనుండి చిత్రీకరిస్తున్నాడు. ముగ్గురు హేమాహేమీ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లు నిర్మిస్తున్న ఈచిత్రానికి వారు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఇక ఈసినిమాలో మహేష్ న్యూ అండ్ కాలేజ్ స్టూడెంట్ లుక్ తో ఇరగదీస్తాడనే న్యూస్ ఉంది. అలాగే రైతు సమస్యలను కూడా మహేష్ సినిమాలో వంశి పైడిపల్లి చూపించబోతున్నాడనే టాక్ కూడా ఉంది.

అయితే ఇక్కడ డెహ్రాడూన్ షెడ్యూల్ తర్వాత మహేష్ 25 మూవీ టీమ్ మొత్తం ఫారిన్ లో జరిగే షూటింగ్ కోసం ఫ్లైట్ ఎక్కనుంది. ప్రస్తుతం 24 సినిమాలను కంప్లీట్ చేసిన మహేష్ బాబు తన ఈ 24 చిత్రాల కెరీర్ లో ఎన్నో ఒడిడుకులు తట్టుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఇప్పుడు ఈ 25వ సినిమాతో తన కెరీర్ లో మరపురాని చిత్రంగా ఉండాలని మహేష్ ఆశపడుతున్నారు. అలాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమాకి సంబందించి ఎలాంటి విషయాలు బయటికి రాకుండా వంశి పైడిపల్లి తో సహా.. నిర్మాతలు ముగ్గురు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న రాజసం, రైతు బిడ్డ టైటిల్స్ విషయంలో మూవీ యూనిట్ ఎక్కడా నోరు మెదపడం లేదు.

అయితే ఇంతగా మహేష్ 25 మూవీ విషయాలేమి బయటికి రాకుండా ఎందుకు చూసుకుంటున్నారంటే… మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న అయన అభిమానులకు, ప్రేక్షకులకు సప్రైజింగ్ గా ఉండే విధంగా బర్త్ డే స్పెషల్ గా మహేష్ 25వ సినిమాకు సంబంధించి టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ బయటపెట్టాలన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. మరి ఆ లుక్ అండ్ టైటిల్ తోనే మహేష్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాలనే యోచనలో నిర్మాతలు కూడా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతానికి షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదలకు డేట్ లాక్ చేసిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*