నాగ్ కామెంట్స్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!

కొన్నికొన్ని సార్లు మనకి అనిపించింది అనిపించినట్టు మాట్లాడితే అప్పుడప్పుడు వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జున అటువంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. గతంలో ఆయన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఫంక్షన్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసాయి. గత సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తో పాటు ఎన్టీఆర్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు 50 కోట్లు పైగా వసూల్ చేసాయి. ఇందులో నాగ్ సినిమాకి తక్కువ ఖర్చు అవ్వగా.. ఎన్టీఆర్ సినిమాకు బడ్జెట్ బాగా ఎక్కువైంది.

మూడు సినిమాలే హిట్లు..

అయితే దీన్ని ఉద్దేశించుకునే నాగ్ మాట్లాడుతూ…’ఎంత ఖర్చు పెడితే ఎంత వచ్చిందన్నది ముఖ్యం’ అంటూ నాగ్ ఇన్ డైరెక్ట్ గా ఎన్టీఆర్ సినిమాపై కామెంట్ చేయడం అప్పుడు వివాదాస్పదమైంది. కట్ చేస్తే రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యిన ‘గూఢచారి’ సక్సెస్ మీట్లో నాగ్ మాట్లాడుతూ…. ఈ ఏడాది రిలీజ్ అయ్యినా సినిమాల్లో మూడు సినిమాలే హిట్స్ అని..అవి ‘రంగస్థలం’.. ‘మహానటి’.. ‘గూఢచారి’ మాత్రమే అని నాగ్ అన్నాడు. కానీ ఈ ఏడాది రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ కు సాధించిన మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఉంది. కానీ నాగ్ ఆ పేరు చెప్పలేదు.

100 కోట్లు వసూలు చేస్తే హిట్ కాదా..?

అలానే ‘భాగమతి’.. ‘ఛలో’.. ‘తొలి ప్రేమ’.. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలు కూడా జనాలు ఆదరించి సూపర్ హిట్ చేసారు. ఈ సినిమాలన్నీ నిర్మాతలకు మంచి లాభాలందించినవే. మిగతావన్నీ చిన్న సినిమాలు కాబట్టి.. ఆ సినిమాల్లో స్టార్ హీరోలు ఎవరు నటించలేదు కాబట్టి నాగ్ కామెంట్‌ను వాటికి సంబంధించిన వాళ్లు తేలిగ్గా తీసుకుంటారేమో కానీ.. మహేష్ ఫ్యాన్స్ ఆలా తీసుకోవట్లేదు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నిలిచిన ‘భరత్ అనే నేను’ సినిమా గురించి చెప్పకపోవడంతో నాగ్ పై మండిపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. 100 కోట్లు పైగా వసూల్ చేసిన సినిమాను హిట్ గా పరిగణించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*