బాహుబలి లాంటి సినిమాలో నటించకపోతేనేమి..!

క్రికెటర్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఏమిటి.. అనేక రంగాల్లో ప్రతిభ చూపించే వారి మైనపు విగ్రహాలు ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తెగ కొలువు తీరుతున్నాయి. షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్.. పద్మావతీ చిత్రంతో దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ ల మైనపు బొమ్మలే కాదు… సౌత్ హీరోల్లో బాహుబలి తో ప్రభంజనం సృష్టించిన ప్రభాస్ మైనపు బొమ్మ కూడా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోకి అతి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి బాలీవుడ్ వారు మాత్రమే అందుకునే ఈ అరుదైన గౌరవాన్ని మన హీరోలు కూడా సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలిలా ప్రపంచ వ్యాప్త గుర్తింపుతో.. ప్రభాస్ మైనపు బొమ్మ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతి త్వరలోనే కొలువు దీరనుంది. ఇప్పటికే ప్రభాస్ మైనపు బొమ్మ తయారీలో ఉంది.. మరి బాహుబలి సినిమా రేంజ్ ఏమిటో ప్రభాస్ మైనపు బొమ్మే చెబుతుంది.

ప్రభాస్ తర్వాత మహేష్…

ఇక తాజాగా బాహుబలి లాంటి ఇండియన్ మూవీలో నటించకపోయినా.. కేవలం తెలుగు సినిమాలు మత్రమే చేస్తూ అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు మైనపు విగ్రహం కూడా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరనుంది. మైనపు విగ్రహాలు అసలు మనిషి ఎలా ఉంటాడో అదే తీరుగా అంటే అందంగా ఉంటాయి. ఇక కేవలం ఆ బొమ్మకు ప్రాణం మాత్రమే ఉండదు.. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట. మరి అంతటి అరుదైన గౌరవాన్ని ఇప్పుడు మన మహేష్ కూడా సొంతం చేసుకున్నారు. మూడు నెలల క్రితమే తన బాడీ మెజర్మెంట్స్ ని మేడమ్ టుస్సాడ్స్ వారికి అందించిన మహేష్.. మైనపు బొమ్మ ఎంత అందంగా తయారు చేస్తున్నారో మేకింగ్ ఫోటో ఒకటి సోషల్ ఇండియాలో వైరల్ అయ్యింది.

అచ్చం మహేష్ బాబును మరిపించేలా

మహేష్ అందమైన మొహాన్ని ఇవాన్ రీస్ అనే కళాకారుడు ఎంతందంగా తయారు చేస్తున్నాడో ఆ ఫొటోలో కనబడుతుంది. అచ్చం మహేష్ మాదిరిగా ఉన్న ఆ ఫోటో అందరిని ఆకర్షిస్తుంది. రొమాంటిక్ స్టయిల్‌లో మెస్మరైజ్డ్ లుక్స్‌ తో మహేష్ ఫేస్‌ కనబడుతుంది. మరి మహేష్ మైనపు బొమ్మకు ఫినిషింగ్ పూర్తి కాగానే… మహేష్ మైనపు విగ్రహావిష్కరణకు ముహూర్త పెడతారని చెబుతున్నారు. ఏదైనా టాలీవుడ్ సినిమాలతోనే ఇంత క్రేజ్ సంపాదించిన మహేష్ ఎంతైనా గ్రేట్ కదా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*