మహేష్ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్త కాబోతుందా…?

maheshbabu next movie

మహేష్ – సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా ‘మహర్షి’ తర్వాత తెరకెక్కనుంది. అయితే సుకుమార్ ఈసినిమాలో మహేష్ లుక్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మహేష్ ను ఇప్పటివరకు ఎవరూ సరైన మాస్ క్యారక్టర్ లో చూడలేదు. అలానే పోరాట యోధుడిగా కూడా చూడలేదు. అయితే సుకుమార్ మాత్రం ఇప్పటివరకు మహేష్ ను ఎవరు చూపించని విధంగా చూపించబోతున్నాడు.

తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా…..

గత కొన్ని రోజులు నుండి డైరెక్టర్ సుకుమార్ మహేష్ ను ఎలా చూపిద్దాం అనుకున్న టైములో ఆయనకు ఎవరో తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పారంట. దానికి సంబంధించి సుక్కు చదువుతున్నారు. అచ్చం ఆలా తీయకపోయిన దాన్ని స్ఫూర్తితో ఒక కల్పిత కథను తయారు చేసి మహేష్ తో తీద్దాం అని అనుకుంటున్నాడట. మరి మహేష్ సాయుధ పోరాటం చేస్తాడా? అంటే వినటానికి కొత్తగా ఉండొచ్చు.

లుక్ మార్చేసి…..

కానీ సుకుమార్ ఇట్టిపరిస్థితిల్లో మహేష్ తో అటువంటి సినిమానే తీయాలని డిసైడ్ అయ్యారట. ‘రంగస్థలం’ సినిమాలో చెర్రీ లుక్ ను పూర్తిగా మార్చేసిన ఘనత సుకుమార్ దే. అలానే మహేష్ లుక్ తో పాటు తన మాక్ ఓవర్ ని సరిగ్గా డీల్ చేస్తే ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుందని భావిస్తున్నాడట. మరి మహేష్ ‘రా’ లుక్ లో చూడం ఫ్యాన్స్ ఇష్టపడతారా? అంటే చూడాలి ఏమౌవుతుందో అని.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*