మహేష్ ఓకె..కానీ వివాదం పరిస్థితి ఏంటి..?

గత వారం రోజుల నుండి టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ గ్రూప్, సీనియర్ నటుడు నరేష్ గ్రూప్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ‘మా’ వారు నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో అవకతవకలు జరిగాయని నటుడు నరేష్ ఆరోపించడం ఈ వివాదానికి దారి తీసింది. ఇది శ్రీకాంత్, శివాజీ రాజా ఒక గ్రూప్ గా నరేష్ ఇతరులు ఒక గ్రూప్ గా విడిపోయి ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదాలతో ఇండస్ట్రీ పరువు బజారున పడుతోందని ఇప్పటికే కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఇందులో జోక్యం చేసుకుని గొడవకు ఫుల్ స్టాప్ పెట్టె పనిలో ఉన్నారు.

చిరంజీవికి ఫోన్ చేసిన మహేష్ బాబు…

వాస్తవానికి మహేష్ బాబు తో అమెరికాలో ‘మా’ వారు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయాలనుకున్నారు. ఆ వచ్చిన డబ్బు తో అసోసియేషన్ బిల్డింగ్ కట్టాలని ‘మా’ వారు భావిస్తున్నారు. అయితే మహేష్ బాబు మొదట వస్తా అని భరోసా ఇచ్చి ఆ తర్వాత ఈ గొడవల కారణంగా రావట్లేదు అని చెప్పాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపధ్యంలో మహేష్ బాబు స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి నేను ఆ ఈవెంట్ లో తప్పనిసరిగా పాల్గొంటానని తెలిపాడట. ఈ వివాదం అంతా ఓ కొలిక్కి వచ్చాకే తన ఈవెంట్ డేట్ ఫైనలైజ్ చేయాలని క్లారిటీ ఇచ్చాడట.

ఎన్నికలు ఉన్నందునే…

దీంతో మహేష్ కూడా ఒకే చెప్పడంతో ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా చిరు ఇద్దరి మధ్య చర్చలు చేపట్టాలని ఆలోచనలో ఉన్నారట. మరి చిరంజీవి ఈ వివాదానికి ఎండ్ కార్డు ఎప్పుడు వేస్తాడో చూడాలి. నరేష్ ఆలా ఆరోపించడానికి కారణం మరో ఐదు నెలల్లో ‘మా’ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆలా ఆరోపణలు చేస్తున్నాడని శ్రీకాంత్ అండ్ టీం కామెంట్స్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*