మాస్ లుక్ నుండి క్లాస్ లోకి..!

వంశీ పైడిపల్లి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ జెట్ స్పీడుతో సాగుతుంది. షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి చాలా టైం తీసుకున్న మహర్షి టీమ్… షూటింగ్ మొదలైనప్పటి నుండి విరామమే లేకుండా చిత్రీకరిస్తున్నారు. మహేష్ కూడా మహర్షి షూటింగ్ కోసం క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీరోల్ పోషిస్తున్నాడు. మహేష్ బాబు అల్లరి నరేష్ స్నేహితులుగా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ స్టూడెంట్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే స్టూడెంట్ లుక్ తో మహేష్ చిన్న గెడ్డం, పక్క పాపిడి, గళ్ల చొక్కాతో అదరగొట్టాడు.

క్లీన్ షేవ్ తో అమెరికాకు…

ప్రస్తుతం డెహ్రాడూన్, హైదెరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న మహర్షి సినిమా ఇప్పుడు అమెరికా షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కబోతుంది. న్యూయార్క్ లోని కొన్ని అరుదైన లొకేషన్స్ లో మహర్షి సినిమా తదుపరి షెడ్యూల్ జరగబోతుంది. అయితే మహర్షి మూవీలో స్టైలిష్ స్టూడెంట్ లుక్ లో అదరగొట్టిన మహేష్ అమెరికా షెడ్యూల్ కోసం క్లిన్ షేవ్ తో దర్శనమియ్యబోతున్నాడట. మహర్షి సినిమాలో అతి కీలక సన్నివేశాలు ఈ నెల రోజుల్లో అమెరికాలో షూట్ చేయబోతున్నారట. ఇక ఈ షెడ్యూల్ లో మహేష్ మళ్లీ డిఫరెంట్, స్టయిలిష్ గెటప్ లో కనబడబోతున్నాడట.

ఒకే సినిమాలో రెండు లుక్స్…

ఈ లుక్ కోసం మహేష్, వంశీ పైడిపల్లి చాలా శ్రద్ద తీసుకుంటున్నారట. మహేష్ ఫాన్స్ బాగా కనెక్ట్ అవుతారని.. అందుకే ఈ గెటప్ కోసం మహేష్ స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడట. మరి ఒకే సినిమాలో ఇలా డిఫెరెంట్ లుక్స్ తో మహేష్ మాత్రం మెస్మరైజ్ చేస్తాడని… కాదు కాదు మహర్షి, రిషి లుక్స్ అంటూ రెండు లుక్స్ లో మహేష్ ఇరగదీస్తాడని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల డేట్ ఇచ్చేసారు మేకర్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*