మహర్షిలో మహేష్ తల్లిగా సీనియర్ హీరోయిన్..?

ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్, మహేష్ లుక్, సినిమా టీజర్ ని విడుదల చేశారు. అయితే అప్పట్లో రెండు రోజులు హడావిడి చేసిన అభిమానులు మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇక మహర్షి మూవీ షూటింగ్ కూడా డెహ్రాడూన్, గోవా పరిసర ప్రాంతాల్లో సైలెంట్ గా నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఇక మహేష్ మహర్షి మూవీలో రిషిగా, మహర్షి గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మహేష్ కనబడతాడని… రైతు సమస్యలను పరిష్కరించడానికి విదేశాల నుండి మహేష్ బాబు దిగుతాడని.. స్నేహితుడు రవి(అల్లరి నరేష్) సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కున్న సమస్యలపై ఈ సినిమా కథ ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.

మళ్లీ జయప్రద ఎంట్రీ..!

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనబడనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా నటిస్తుందని టాక్ ఉంది. మహేష్ కి తల్లిగా అలనాటి మేటి హీరోయిన్ సీనియర్ నటి జయప్రద నటిస్తుందట. గతంలో బాలకృష్ణ సినిమాలో మీరా జాస్మిన్, స్నేహకి తల్లిగా నటించిన జయప్రద మళ్లీ ఇన్నాళ్లకి మహేష్ చిత్రంతో టాలీవుడ్ లోకి వస్తుంది. ఇంతకుముందు జయప్రద టాప్ హీరోయిన్ గా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ సీనియర్ హీరోల సరసన నటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*