మహేష్ టైటిల్ అదేనా..?

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25వ సినిమా షూటింగ్ విరామమే లేకుండా జరుగుతుంది. సినిమా మొదలవ్వడానికి కాస్త సమయం తీసుకున్నా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి పరిగెత్తిసున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ముగ్గురు బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినిదత్, పివిపి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని చెప్పడంతో ఇప్పట్లో మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ బయటికి రాదని మహేష్ అభిమానులు కాస్త ఫీల్ అయ్యారు.

రిషి టైటిల్ ఖరారేరా..?

కానీ మహేష్ పుట్టినరోజు అంటే ఆగస్టు 9నే మహేష్ కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రాబోతుంది. ఈ విషయాన్నీ మూవీ టీమ్ రోజుకో లెటర్ లోగోతో అంటే మహేష్ చిత్ర టైటిల్ లోని ఒక్కో అక్షరాన్ని.. ఆ అక్షరంలో మహేష్ గత సినిమాల ఫొటోలతో పాటుగా వదులుతూ… అందరిలో క్యూరియాసిటీ పెంచేస్తుంది. అయితే మూవీ టీమ్ వదులుతున్న ఆ అక్షరాల్లోనే మహేష్ 25 మూవీ టైటిల్ దాగుందని.. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చగా జరుగుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన ఆర్, ఐ, ఎస్ అక్షరాలను కలుపుతూ మహేష్ మూవీ టైటిల్ రిషి (RISHI) అంటూ ప్రచారం చేస్తున్నారు.

అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి

మరి మహేష్ 25వ మూవీ టైటిల్ గా గతంలోనే రాజసం అనే టైటిల్ గా బాగా ప్రచారం జరిగింది. కానీ ఇపుడు కన్ఫ్యూషన్ లో పడిన ప్రేక్షకులు మహేష్ టైటిల్ ని రిషి గా అనుకుంటున్నారు. మరి ఈ మూడు రోజుల్లో మహేష్ టైటిల్ విషయంలో ఇంకెంత ఆకస్తికర టైటిల్స్ బయటికొస్తాయో గాని.. ప్రస్తుతం మాత్రం మహేష్ టైటిల్ గా రిషి అనే టైటిల్ మాత్రం ప్రచారం జరుగుతుంది. మరి ఫైనల్ గా వంశీ పైడిపల్లి – మహేష్ ల చిత్ర టైటిల్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీకి తెర పడాలంటే ఆగస్టు 9 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*