ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మహేష్ !

‘పోకిరి’, ‘అతిధి’ సినిమాల్లో తప్ప తను నటించిన ఏ సినిమాలోనూ మహేష్ తన లుక్ ని మార్చలేదు. అయితే రీసెంట్ గా స్టార్ట్ అయిన వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ లుక్ మార్చాడు. తన కెరీర్లో తొలిసారిగా కొంచెం ఎక్కువ గడ్డం, జుట్టు పెంచి.. రఫ్ లుక్‌లోకి మారాడు. ఈ లుక్ తోనే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఆ లుక్ కు సంబంధించి పిక్స్ కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.

మళ్లీ పాత లుక్ లోకి…

దాదాపు నెల పాటు ఉత్తరాఖండ్‌లో జరిగిన షెడ్యూల్ లో మహేష్ ఆ లుక్ లోనే యాక్ట్ చేశాడు. షూటింగ్ మధ్యలో ఓ ప్రకటనలో కూడా అదే లుక్ తో నటించాడు. అయితే ఆ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ లుక్ తోనే మహేష్ సినిమా మొత్తం ఉంటాడు అనుకుంటే అందరికీ షాక్ ఇచ్చాడు. సడన్ గా గడ్డంని బాగా ట్రిమ్ చేసి కనిపించాడు.

ఒక షెడ్యూల్ వరకే ఆ లుక్

ఆదివారం చెన్నై సిల్క్స్ వాళ్ల కొత్త షోరూం ఓపెనింగ్‌కి వచ్చిన మహేష్ ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకు అలాగా గడ్డం ట్రిమ్ చేసి కనిపించాడో అన్నది అర్థం కాలేదు. బహుశా సినిమాలో ఒక ఎపిసోడ్ వరకు మహేష్ గడ్డంతో కనిపిస్తాడేమో అనుకుంటున్నారు అంతా. ఇక త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది.. ఇందులో ఎవరు పొల్గొంటారో ఇంకా తెలియాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*