కత్తి లాంటి లుక్ లో మహర్షి..!

భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు యంగ్ లుక్ తో సీఎం గా అదరగొట్టాడు. కొరటాల డైరెక్షన్ లో మహేష్ చేసిన రెండు సినిమాల్లో మహేష్ బాబు చాలా యంగ్ గా డీసెంట్ గా క్లాసీ లుక్ లోనే కనబడ్డాడు. ఈ వయసులోనూ మహేష్ తన అందంతో.. తన వయసుని తగ్గించేసుకుంటున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ కెరీర్ లో మైలురాయి అయిన మహర్షి సినిమాలోనూ మహేష్ స్టూడెంట్ గా యంగ్ లుక్స్ తోనే అందరినీ మెస్మరైజ్ చేసాడు. ఇప్పటికే విడుదలైన మహర్షి లో మహేష్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

నిజంగానే డ్యూయల్ రోలేనా..?

తాజాగా మహేష్ బాబు మహర్షి సినిమాలోని లుక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మహర్షి లొకేషన్ నుండి మహేష్ లుక్ ఒకటి లీకైంది. ఆ లీకెడ్ ఫొటోస్ లో మహేష్ బాబు చాలా అంటే చాలా యంగ్ అండ్ హ్యాండ్‌సమ్‌‌‌గా అదరగొడుతున్నాడు. న్యూలుక్‌ లో మహేష్ ని చూసిన ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుననట్టుగా మహర్షి సినిమాలో డ్యూయల్ రోల్ ఏమైనా చేస్తున్నాడా అంటూ డౌట్ క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే డెహ్రాడూన్, గోవాలలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వంశీ పైడిపల్లి టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అది కూడా మహర్షి ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టుగా చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*