నిజంగానే ఫాన్స్ వర్రీ అవుతున్నారా..?

టాలీవుడ్ లో ఒక్కసారిగా టాప్ రేస్ లోకి దూసుకొచ్చిన పూజ హెగ్డే ని స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సరిగ్గా అంచనా వెయ్యలేదా? డీజే లో చేసిన బికినీ షోకే పడిపోయి.. పెద్ద సినిమా ల్లో అవకాశాలు ఇచ్చేశారా? అంటూ ఇప్పుడు ఎన్టీఆర్, మహేష్ ఫాన్స్ తెగ వర్రీ అవుతున్నారు. ఎందుకంటే పూజ హెగ్డే గ్లామర్ షో చేస్తుంది.. కానీ, ఆమె నటించిన సినిమాల ఫలితాలే అన్నీ తేడా కొడుతున్నాయి. టాలీవుడ్ లో ముకుందా దగ్గర నుండి బాలీవుడ్ లో మోహింజదారో వరకు పూజ హెగ్డేకి ఓ అన్నంత హిట్ ఎక్కడా పడలేదు. అసలు ఒక్క బ్లాక్ బస్టర్ లో కూడా పూజ హెగ్డే నటించలేకపోయింది. ముకుందా, ఒక లైలా కోసం, డీజే, సాక్ష్యం ఇలా అన్ని యావరేజ్ సినిమా లే పూజ చేతిలో ఉన్నాయి. ఆఖరుకి బాలీవుడ్, కోలీవుడ్ లోనూ పూజ హెగ్డే కి హిట్ దక్కలేదు.

హీరోలకూ ఈ సెంటిమెంట్ అంటిస్తుందా..?

కేవలం డీజే దువ్వాడ జగన్నాధం లో పూల్ బికినీ లో పూజ అందాలకే ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు ఇచ్చేయడం కరెక్ట్ కాదనే అభిప్రయాలు సాక్ష్యం సినిమాతో వ్యక్తమవుతున్నాయి. పూజ హెగ్డే నటించిన సాక్ష్యం సినిమా టాక్ చూసాక ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటుగా మహేష్ ఫాన్స్ కూడా వర్రీ అవుతున్నారు. మరి హిట్ లేదు.. కేవలం యావరేజ్ కె పూజ కి ఇంతటి గొప్ప అవకాశాలు ఇవ్వడం ఏమిటో.. అసలే పూజకున్న ఆ యావరేజ్ సెంటిమెంట్ ఎన్టీఆర్ కి గాని, మహేష్ గాని చుట్టుకుంటుందనే భయంలో ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. మరి ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టినా.. మహేష్ 25 మూవీ తో హిట్ కొట్టినా పూజ ఈ యావరేజ్ సెంటిమెంట్ ని బ్రేక్ చెయ్యడమే కాదు మరిన్ని సినిమాల్లో దున్నేయ్యడం ఖాయమే.

ప్రభాస్ కోసం ఫోటో షూట్…

ఇకపోతే ఎన్టీఆర్ సినిమా, మహేష్ సినిమా ల టాక్ తేడా కొట్టాయా.. ఇక మెల్లిగా దుకాణం సర్దుకోవాల్సిందే. అయినా ఈ భామని నిన్నటి వరకు లక్కీ లక్కీ అన్నవాళ్లే ఇప్పుడు సాక్ష్యం దెబ్బకి పూజని చూస్తే డౌట్ పడుతున్నారు. ఏదైనా క్రేజ్ ఉంటేనే ఆటలు సాగేది. క్రేజ్ లో ఏ మాత్రం తేడా కొట్టినా ఇక అంతే సంగతులు. చూద్దాం ఎన్టీఆర్, మహేష్ ఫాన్స్ వర్రీ ని పూజ హెగ్డే ఎలా పోగొడుతుందో. అన్నట్టు ప్రభాస్ సినిమా కోసం పూజ హెగ్డే ఫోటో షూట్స్ లో పాల్గొంటుందని టాక్ వినబడుతుంది. ఎందుకంటే ఎత్తు పరంగా ప్రభాస్ కి సరిపోయే ఫిగర్ ఉన్న పూజ లావుపరంగా ప్రభాస్ పక్కన పీలగా కనబడుతుండడం వలన ఈ ఫోటో షూట్ చేస్తున్నారట. మారి ఆ ఫోటో షూట్ లో ప్రభాస్ పక్కన పూజ సెట్ అయితే జిల్ రాధాకృష్ణ – ప్రభాస్ సినిమా లో పూజ హెగ్డేనే హీరోయిన్ గా ఫైనల్ అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*