మహేష్ తో ఎన్టీఆర్ లేదా చరణ్!

మహేష్ కెరీర్ లోనే ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు…అశ్విని దత్..పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ కు డిజాస్టర్ ఇచ్చిన ‘వన్ నేనొక్కడినే’ డైరెక్టర్ సుకుమార్ తో తన 26 వ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

కథకు ఒక రూపు……

గత కొంత కాలం నుండి ఈ సినిమా స్క్రిప్ట్ పై కూర్చున్నాడు సుకుమార్. కానీ ఇప్పటివరకు ఇది ఒక కొలిక్కి రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కథకు ఒక రూపు వచ్చిందని తెలుస్తుంది.ఇందులో మహేష్ చాలా కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. కానీ ఇది ‘వన్ నేనొక్కడినే’ లా ప్రయోగం కాదని..ఇది ఒక మంచి కథ అని ఇన్ సైడ్ టాక్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. ఇందులో 20 నిముషాలు నడవిడి దాకా ఓ పాత్ర ఉందని దానికి సుకుమార్ ఎవరైనా స్టార్ హీరోని తీసుకుంద్దాం అని అనుకుంటున్నాడని సమాచారం.

వారిలో ఒకరిని……

ప్రభాస్..చరణ్..ఎన్టీఆర్ లలో ఎవరో ఒక్కరిని తీసుకుంద్దాం అని సుక్కు భావిస్తున్నాడట. కానీ ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ ‘సాహూ’ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా తర్వాత వెంటనే రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. సో ప్రభాస్ చేసే ఛాన్స్ లేదు. ఇక తారక్..చరణ్ ఉన్నారు. మహేష్ కు రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు కనుక వారిద్దరిలో ఎవరో ఒకరు ఆ పాత్ర ఒప్పుకునే అవకాశంగా ఎక్కువగా కనపడుతోందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికార ప్రకటన కోసం వెయిట్ చేయక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*