మహేష్ పేరెంట్స్ వీళ్లేనా?

Mahesh babu telugu post telugu news

మహేష్ – వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమా కథల విషయంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. భారీ బడ్జెట్ పెడుతున్న ఈ సినిమాలో మహేష్ రెండు వేరియేషన్స్ యున్న పాత్రల్లో కనబడనున్నాడనే ప్రచారం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న మహర్షి మహేష్ బాబు తన స్నేహితుడు రవి, అల్లరి నరేష్ కున్న సమస్యల పరిష్కరానికి ఇండియా వచ్చి స్నేహితుడు రవి ప్రాబ్లెమ్ ని పరిష్కరించడంతో పాటుగా రైతు సమస్యలను కూడా ఒక కొలిక్కి తెచ్చి అందరికి ఆదర్శంగా నిలవడమే కాక…..ఒక మంచి మెసేజ్ ఇవ్వడంతో సినిమా ముగుస్తోంది అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద మహేష్ తల్లిగా నటిస్తూందనే న్యూస్ బాగా హైలెట్ అయ్యింది. ఇక మహర్షి తల్లి జయప్రద అని అందరూ ఫిక్స్ అయినా టైములో అవన్నీ గాలి వార్తలే అని… మహేష్ తల్లితందులుగా సహజనటి జయసుధ – ప్రకాష్ రాజ్ నటిస్తున్నారట.ఈ విషయాన్నీ స్వయంగా జయసుధే బయట పెట్టారు. ఇకపోతే దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు – అశ్వినీదత్- పివిపి లు నిర్మిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*