మళ్లీ మళ్లీ సర్ప్రైజ్ చేస్తున్నారు

ఇప్పుడు టాలీవుడ్ లో నయా ట్రెండ్ నడుస్తుంది. హీరోల మధ్యన స్నేహ సంబంధాలు వెల్లు విరుస్తున్నాయి. అభిమానుల కోసం మేము ఎప్పటికి స్నేహంగా ఉంటామని మహేష్ భరత్ అనే నేను ప్రీ రీలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. కానీ టాలీవుడ్ హీరోల మధ్య ఇప్పుడు విడదీయరాని స్నేహమైతే ఏర్పడిపోయింది. ఒకరి బర్తడే పార్టీలకి ఒకరు వెళ్లడం… అసలు ఒకే పార్టీలో ముగ్గురు స్టార్ హీరోలు కలవడం మాములు విషయం కాదు. కానీ ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఈ మధ్యన ఎక్కడ చూసినా మంచి బాండింగ్ మైంటైన్ చేస్తున్నారు. మహేష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ముగ్గురు కలిసిమెలిసి ఉంటున్నారు.

జై లవకుశ, భరత్ అనే నేను, రంగస్థలం సినిమాల హిట్ పార్టీలకు ఈ ముగ్గురు హాజరై అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇక రామ్ చరణ్ అయితే ఎన్టీఆర్ వెడ్డింగ్ యానివెర్సరీకి భార్య ఉపాసనతో కలిసి ఎన్టీఆర్ ఇంటికెళ్లి మరీ విషెస్ చెప్పాడు. ఇక ఉపాసన, నమ్రత లు మంచి ఫ్రెండ్స్. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ లు ఎక్కడ కలిసిన పార్టీనే అన్నట్టుగా..అభిమానులకు హోల్సేల్ గా మెస్సేజ్ ఇస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కలిసి ఒక డెరెక్టర్ బర్త్ డే పార్టీలో మెరిశారు. బృందావనంతో ఎన్టీఆర్ తో పని చేసి హిట్ ఇచ్చాడు, రామ్ చరణ్ తో ఎవడు సినిమా ఛేసి హిట్ ఇచ్చాడు.

ఇక తాజాగా మహేష్ తో తన కెరీర్ లో నిలిచిపోయే 25 వ మూవీ ని డైరెక్ట్ చేస్తున్న వంశి పైడిపల్లి పుట్టిన రోజు జులై 27 న …. వంశి పైడిపల్లి ఇచ్చిన పుట్టినరోజు పార్టీకి ఈ ముగ్గురు స్టార్ హీరోలు వచ్చి వంశీకి విషెస్ చెప్పడమే కాదు….ఆ పార్టీలో కలిసి ఫొటోస్ కూడా దిగారు. మరి ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వంశి దిగిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ తో పాటుగా వంశి పైడిపల్లి కూడా ఒకే ఫ్రెమ్ లో ఉన్న ఆ ఫోటో ని మీరు ఓ లుక్కేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*