శ్రీను వైట్ల కోరికను కాదన్న మహేష్

మహేష్ కెరీర్ లో దూకుడు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీను వైట్ల మహేష్ కు మంచి టైంలో సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి డైరెక్టర్ శ్రీను వైట్ల మహేష్ ను ఒక కోరిక కోరగా అది మహేష్ తిరస్కరించినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఆ పాత్రలో కోసం గౌతమ్ కావాలని

ప్రస్తుతం ఇతని డైరెక్షన్ రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంథోని సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్ర చాలా కీలకం అంట. కేవలం ఈ ఎపిసోడ్ కోసమే అమెరికాలో 20 రోజులు షెడ్యూలు చేసినట్లు టాలీవుడ్ టాక్. అటువంటి పాత్ర కోసం ఎవరిని తీసుకుందాం అన్న సమయంలో శ్రీను వైట్లకి ఒక ఆలోచన వచ్చి మహేష్ ను సంప్రదించాడట.

చదువుపైనే దృష్టి పెట్టాలి

మహేష్ కొడుకు గౌతమ్ ను ఈ పాత్ర కోసం అడిగితే మహేష్ సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతం గౌతమ్ స్టడీస్ మీద దృష్టి పెట్టాలి.. ఇలాంటి టైంలో దృష్టి మళ్లుతుందని క్లారిటీ ఇచ్చాడట. దాంతో శ్రీను వైట్ల ఆ పాత్ర కోసం ఆల్టర్ నేటివ్ చూసుకున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1