వ్యాపార రంగంలోకి మహేష్..?

సౌత్ లో సూపర్ స్టార్ గా పేరున్న స్టార్స్ కి ఎంత క్రేజుందో రజనీకాంత్, మహేష్ బాబుని చూస్తుంటే తెలుస్తుంది. రజనికి ఉన్న అభిమానగణం, మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మహేష్ బాబు కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసినప్పటికీ… ఇండియా వైడ్ గా బోలెడంత క్రేజుంది. అందుకే బోలెడన్ని బ్రాండ్స్ మహేష్ చేతిలో ఉన్నాయి. సినిమాలతోనూ, కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. మహేష్ సినిమాలు ప్లాప్ అయినా.. ఆయన తరవాతి సినిమాకి ఉండే ఎంత క్రేజ్ కొలమానంలో కొలవడం కష్టమనేంత ఉంటుంది. ఇక సినిమాల్లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే మహేష్ బ్రాండ్ మీద కూడా బోలెడంత సంపాదిస్తున్నాడు.

మల్టీప్లెక్స్ రంగంలోకి…

అయితే మహేష్ రెమ్యునరేషన్, బ్రాండ్స్ కమిట్మెంట్ అన్ని మహేష్ భార్య నమ్రతానే చూసుకుంటుంది. తాజాగా మహేష్ బాబు వ్యాపారంలోకి అడుగెట్టబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. అందులో భాగంగానే ఇంతకుముందే మహేష్ బాబు అమరావతి, వైజాగ్ లలో కొంత భూమిని కొనుగోలు చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు… ఇప్పుడు మల్టిప్లెక్స్ రంగంలోకి కూడా మహేష్ అడుగుపెట్టబోతున్నాడట. మొన్నటికి మొన్న ప్రభాస్ నెల్లూరు దగ్గరలో మల్టిప్లెక్స్ ని ఆయన ఫ్రెండ్స్ యువి క్రియేషన్స్ తో కలిసి కడుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాత సురేష్ బాబు తో కలిసి మల్టిప్లెక్స్ ని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లలో కట్టబోతున్నట్టుగా ప్రచారం జరిగింది.

ఏషియన్ వారితో కలిసి…

ఇక తాజాగా మహేష్ కూడా ఈ మల్టిప్లెక్స్ రంగంలోకి రాబోతున్నట్టుగా చెబుతున్నారు. ఏషియన్ ఫిలింస్ వారితో కలిసి మహేష్ బాబు ఈ మల్టిప్లెక్స్ రంగంలోకి రాబోతున్నాడట. అయితే ఒకచోట సక్సెస్ అయితే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహేష్, ఏషియన్ ఫిలింస్ వారు ముఖ్య పట్టణాల్లో ఈ మల్టిప్లెక్స్ లు నిర్మిస్తారని తెలుస్తుంది. మరి సినిమాలు, బ్రాండ్స్ తో బాగా సంపాదిస్తున్న మహేష్ ఇప్పుడు వ్యాపారంలోనూ దూసుకుపోతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*