ఈ వయసులోనూ ఇంత స్మార్ట్ గానా..?

మహేష్ బాబు ఇప్పుడు మరీ కుర్రోడిగా మారిపోయాడు. ఆయన అప్ కమింగ్ మూవీ కోసం చాలా స్మార్ట్, యంగ్ లుక్ లోకి చేంజ్ అయ్యాడు. మరి ఆ సినిమాలో స్టూడెంట్ క్యారెక్టర్ గా కొంత టైం స్పెండ్ చెయ్యాలి కదా… అందుకే మహేష్ ఇలా కాస్త పెరిగిన గెడ్డం, మంచి బాడీ ఫిజిక్ తో కుర్రాడిలా మారిపోయాడు. మరి 40 ఏళ్లు వచ్చినా ఇంకా 25 ఏళ్ల కుర్రాడిలా కనబడే మహేష్ బాబు ఇప్పుడు మరీ యంగ్ లుక్ లోకొచ్చేసాడు. వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనడతడతాడనే టాక్ ఉంది. అందుకే ఆ సినిమా కోసం ఇలాంటి యంగ్ లుక్ అవతారమెత్తాడు మహేష్.

స్టూడెంట్ వార్ కూడా..

ఇక మహేష్ బాబు కాలేజ్ లో ఒక ఫైట్ సన్నివేశాన్ని కూడా ముగించాడట. అది కూడా క్రికెట్ ఫైట్ అంటున్నారు. మహేష్ బాబు చదువుతున్న కాలేజ్ లో క్రికెట్ ఆటలో రెండు గ్రూప్ లకు మధ్య జరిగిన గొడవతో మహేష్ ఇలా క్రికెట్ బ్యాట్, స్టాంప్స్ తో విలన్స్ ని బ్యాటింగ్ ఆడేసాడట. ఇకపోతే ఈ సినిమా లో కామెడీ హీరో అల్లరి నరేష్ కీలకపాత్రలో మహేష్ ఫ్రెండ్ గా నటిస్తుండగా.. పూజ హెగ్డే హీరోయిన్. దేవిశ్రీ స్వరాలు సమకూర్చే ఈ సినిమాని విచిత్రంగా ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్నారు.