మహేష్ సినిమాకు ఆ ముగ్గురు

Mahesh babu telugu post telugu news

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న వంశీ పైడిపల్లి చిత్రం గత మూడు రోజులు నుండే షూటింగ్ స్టార్ట్ అయింది. డెహ్రడూన్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎప్పటి నుండో మహేష్ తో ఈ సినిమా చేయాలనీ ఖాళీగా ఉన్నాడు డైరెక్టర్ వంశీ. మహేష్ కూడా వంశీకి కావాల్సినంత సమయం ఇచ్చి పక్కాగా స్క్రిప్టు రెడీ చేయించాడు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు.. అశ్వినీదత్ లాంటి ఇద్దరు అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్నారు. అయితే మొదట్లో ఈ సినిమాను నిర్మించే హక్కులు నావి అని కోర్టులో న్యాయపోరాటం చేసి తిరిగి మళ్లీ ఈ సినిమాలో భాగస్వామి అయ్యాడు పొట్లూరి వరప్రసాద్. ఇప్పుడు ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలు. దిల్ రాజు.. అశ్వినీదత్.. పొట్లూరి వరప్రసాద్. గతం లో వీరి బ్యానర్స్ లో మహేష్ సినిమాలు చేసాడు.

ఇప్పుడు మహేష్ ల్యాండ్ మార్క్ సినిమాకు ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. వైజయంతీ మూవీస్.. పీవీపీ సినిమా ఈ మూడు బేనర్ల పేర్లు ఒకే పోస్టర్ మీద పడటం అరుదైన విషయమే. మరి ఈ ముగ్గురు నిర్మాతలు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో.. ఎంత ఖర్చు పెడతారో.. మహేష్‌తో ఎలాంటి సినిమా తీస్తారో చూద్దాం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*