నరేష్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్..?

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. హీరోయిన్ గా మహేష్ తో మొదటిసారి పూజ హెగ్డే జోడి కడుతుంది. అయితే ఈ సినిమాలో కామెడీ హీరో అల్లరి నరేష్… మహేష్ బాబుకి స్నేహితుడిగా మహర్షి సినిమాలో కీ రోల్ పోషిస్తున్నాడు. సినిమాని మలుపుతిప్పే కీలక యాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. అయితే అల్లరి నరేష్ హీరోగా సునీల్ మరో హీరోగా నటించిన సిల్లీ ఫెలోస్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సిల్లీ ఫెలోస్ ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ మహేష్ మహర్షి ముచ్చట్లు కూడా మీడియాతో పంచుకున్నాడు.

అచ్చం అదే పాత్రలా…

ఒక రిపోర్టర్ అల్లరిని ఉద్దేశించి మహర్షి సినిమాలో మహేష్ కి స్నేహితుడిగా నటిస్తున్నారట నిజమేనా అని అడగగా… నరేష్ మాత్రం నర్మగర్భంగా తనదైన శైలిలో ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. శర్వానంద్ తో కలిసి నటించిన గమ్యం సినిమాలో తాను చేసిన గాలి శీను పాత్ర అందరికీ కనెక్ట్ అవడమే కాదు.. తనకి ఆ పాత్ర మంచి పేరు తీసుకొచ్చిందనీ.. ఇప్పుడు మహర్షి లో తన పాత్ర కూడా ఇంచుమించు గమ్యంలో గాలి శీను పాత్ర వంటిదే అని.. ఇప్పటికే మహర్షి సినిమా కోసం మహేష్ తో 45 రోజుల ప్రయాణం చేశానని… ఇంకా 100 రోజుల ప్రయాణం మహేష్ తో ఉందని చెప్పాడు.

ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు…

ఇక వచ్చే అక్టోబర్ నుండి తాను మళ్లీ మహర్షి షూటింగ్ లో జాయిన్ అవుతానని… ఇంతకు మించి ఎలాంటి విషయాలను బయటికి చెప్పొద్దని ఆల్రెడీ నాకు మహేశ్ బాబు వార్నింగ్ కూడా ఇచ్చాడని.. ఫన్నీగా చెప్పేసి నవ్వించాడు ఈ కామెడీ హీరో. అయితే మహర్షి సినిమాలో అల్లరి నరేష్ పాత్ర పేరు రవి. మరి గమ్యంలో గాలి శీనులా.. మాహర్షిలో రవి పాత్ర ద్వారా అల్లరికి అవకాశాలు ఒక రేంజ్ లో రావాలని కోరుకుందాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*