మాణికర్ణికగా కంగనా అదరగొట్టేస్తుంది..!

ఏదైనా పండగొచ్చినా.. ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా సినిమా ప్రియులకు పండగే పండగ.. ఒక వైపు సినిమా రిలీజ్ లు మరోవైపు చిన్న, పెద్ద సినిమాల ఫస్ట్ లుక్స్, అలాగే టీజర్స్ తో హోరెత్తిస్తారు సదరు సినిమా దర్శకనిర్మతలు. ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ లో సినిమాలు, సినిమాల లుక్స్, టీజర్స్ విడుదల చేస్తుంటే.. బాలీవుడ్ లోను భారీ సినిమాల విడుదలతో పాటుగా భారీ సినిమాల టీజర్స్, లుక్స్ ని విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో మాములుగా ఇవాళ విడుదల కావాల్సిన క్రిష్ – కంగనా రనౌత్ ల మణికర్ణిక సినిమా కొన్ని అవాంతరాలతో వచ్చే ఏడాది జనవరి 26 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ రోజు అభిమానులను ఉసూరుమనిపించకుండా దర్శకుడు క్రిష్ మణికర్ణిక గా ఉన్న కంగనా లుక్ ని విడుదల చేసాడు.

అమాంతం పెరిగిన అంచనాలు

వీరనారి ఝాన్సీ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ఈ మణికర్ణిక సినిమాలో కంగనా టైటిల్ రోల్ పోషిస్తుంది. మరి మణికర్ణిక లుక్ లో కంగనా నిజంగా వీరనారి ఝాన్సీ గా అదరగొట్టేస్తుంది. మణికర్ణిక లుక్ లో వీపుపై కుమారుడిని కట్టుకుని రక్తంతో తడిసిన కత్తితో ఆంగ్లేయులపై సింహ గర్జన చేస్తున్న కంగనా లుక్ ఇప్పుడు సినిమాపై అంచనాను అమాంతంగా పెంచేస్తోంది. క్రిష్ ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రని ఎలా తీస్తున్నాడా అనే అనుమానాలు ఇప్పుడు మణికర్ణిక లుక్ తో పటా పంచలైపోయాయి. ఇప్పుడు మాణికర్ణికగా ఉన్న కంగనా లుక్ మాత్రం అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

తెలుగు రచయితనే…

ఇక మణికర్ణిక సినిమాకి తెలుగు రచయిత విజయేంద్ర ప్రసాద్ కథని అందించాడు. దేశంలోని పలు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్ర బృందం.. ఈ సినిమాని జనవరి 26న విడుదల చెయ్యబోతున్నారు. ఇకపోతే మణికర్ణిక జనవరిలో విడుదలవుతుంది కాబట్టి.. ఈలోపు దర్శకుడు క్రిష్ టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*