కంగనా తో పడలేక మరొకరు అవుట్!!

మణికర్ణిక సినిమా గురించిన రోజుకో అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఏదో భారీ సెట్స్ గురించో.. లేదంటే ఆ సినిమాలో హీరోయిన్ కంగనా వేసిన కాస్ట్యూమ్స్ గురించో, లేదంటే ఆ సినిమా లో యాక్షన్ సీక్వెన్స్ గురించో లేటెస్ట్ న్యూస్ లు బయటికి రావడం అటుంచి.. సినిమా విషయంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు.. కంగానాకున్న ముక్కు పొగరు గురించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు హైలెట్ అవుతూనే ఉన్నాయి. మొదటగా మణికర్ణిక సినిమా విషయంలో కంగనా ఇన్వాల్ మెంట్ తట్టుకోలేక దర్శకుడు క్రిష్ ముంబై వదిలి పారిపోయి టాలీవుడ్ కి వచ్చేసి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తలమునకలయ్యాడట. అప్పటినుండి క్రిష్ నుండి మణికర్ణిక విషయమై ఎటువంటి స్పందన లేదు.

స్వీయ దర్శకత్వంలోనే…..

ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంగనా రనౌత్ తన స్వీయ దర్శకత్వంలో కానిస్తుంది. అలాగే క్లాప్ బోర్డు మీద దర్శకుడిగా తన పేరు వేసుకుంది. ఆతర్వాత ఈ సినిమా నుండి నటుడు సోను సూద్ తప్పుకున్నాడు. తనపై చేసిన కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చెయ్యడం.. కంగనా డామినేషన్ తట్టుకోలేక సోను సూద్ బయటికొచ్చాడే ప్రచారం ఉంది. ఇక టాలీవుడ్ అగ్ర కథా రచయితా మణికర్ణిక సినిమాకి కథ అందించాడు. ఆయనే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక విజయేంద్ర ప్రసాద్ కూడా మణికర్ణిక సినిమా నుండి తప్పుకున్నాడనే ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే ఇప్పుడు కంగనా చేస్తున్న రీ షూట్స్ వలన సినిమా బడ్జెట్ 70 కోట్ల నుండి 100 కోట్లకి చేరుకుందట.

తొలినుంచి సమస్యలే…….

ఇక సినిమా విదుదల కూడా బాగా లేట్ అవడంతో… ఇప్పుడు ఆ సినిమా నిర్మాత కూడా మణికర్ణిక నుండి తప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో నిర్మాత సంజయ్ కుట్టి ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రని కంగనా హీరోయిన్ గా 70 కోట్ల పెట్టుబడితో మొదలుపెట్టగా.. మధ్యలో వచ్చిన పలు సమస్యల్తో సినిమా షూటింగ్ బాగా డిలే అవడం, కంగనా కూడా పలు సీన్స్ తన డైరెక్షన్ లో రీ షూట్స్ చెయ్యడంతో.. చిరాకు పుట్టిన నిర్మాత సంజయ్ కుట్టి నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. మరి 70 కోట్ల బడ్జెట్ 100 కోట్లకు పెరిగిపోయింది.. ఎలాగోలా సినిమా విడుదలవుతుంది అనుకుంటే.. సినిమా షూటింగ్ లేట్ కావడంతో.. సినిమా విడుదల కూడా లేట్ అవుతూ రావడంతోనే సంజయ్ కుట్టి ఈ సినిమా నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది.