సుడిగుండంలో మణికర్ణిక..!

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రని కంగనా మెయిన్ లీడ్ లో మణికర్ణికగా సినిమాని తెరకెక్కించాడు. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న మణికర్ణిక ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. అయితే దర్శకుడు క్రిష్ మణికర్ణిక షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల సమయంలో కంగనా రనౌత్ తో గొడవ కారణంగా టాలీవుడ్ కి వచ్చేసి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయో పిక్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్యన కంగనాకి, క్రిష్ కి మధ్యన గొడవంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కంగనా స్వీయ దర్శకత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపించడంతో పాటు క్లాప్ బోర్డు మీద కంగనా పేరు వేయించుకుని క్రిష్ పేరుని దర్శకుడిగా తప్పించేసింది.

ఇప్పుడు సోనూ సూద్ కూడా…

ఈ మధ్యలో తనకు దర్శకుడు క్రిష్ కి గొడవలేం లేవంటూనే క్లాప్ బోర్డు మీద కంగనా పేరు వేయించుకోవడం చూస్తుంటే వారి మధ్య గొడవలున్నాయని అందరికీ అర్థమవుతుంది. ఇక క్రిష్ మాత్రం మణికర్ణిక విషయంలో ఏం స్పందించ లేదు. ఇక తాజాగా మణికర్ణిక సినిమా నుండి ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోనూ సూద్ బయటికొచ్చేసాడు. ఈ విషయాన్నీ సోనూ సూద్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మణికర్ణికలో తాను లేనని క్లారిటీ ఇచ్చేసాడు. అయితే సోనూ సూద్ ఇలా బయటికి రావడం వెనుక కంగనాతో గొడవే కారణం అంటున్నారు. మణికర్ణిక సెట్ లో కంగనాతో విభేదాలు, అలాగే సెట్ లో సోను సూద్ ని తక్కువ చేసి చూడడంతోనే బయటికొచ్చినట్లుగా బి టౌన్ గుసగుసలు.

గడ్డం తీసేసి మరీ…

మరోపక్క సోనూ సూద్ మణికర్ణిక సినిమాలో నటిస్తూనే రణ్వీర్ సింగ్ శింబ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. మణికర్ణిక సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ తీసుకోవడంతో.. శింబ షూటింగ్ లో జాయిన్ అవడం.. శింబ కోసం క్లీన్ షేవ్ కూడా చేసుకున్నాడు. మణికర్ణిక కోసం గెడ్డం పెంచాల్సి ఉందట. కానీ మణికర్ణిక షూటింగ్ బ్రేక్ పడడంతో.. ఆ గెడ్డం తీసేసి శింబ కోసం సోను వెళ్తానంటే.. మణికర్ణిక టీం ఒప్పుకోకపోవడంతో.. సోను సూద్ ఏకంగా ఆ ప్రాజెక్ప్ట్ నుండి తప్పుకుని.. తన ప్లేస్ లో వేరేవారిని పెట్టుకోమని చెప్పి వచేసాడట. మరి ఇలా సమస్యల సుడిగుండంలో మణికర్ణిక కొట్టుకుపోతుంది. అసలు ఇన్ని సమస్యలు రావడానికి కారణం కంగానాకి ఉన్న పొగరే కారణమంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*