మెగా ఫాన్స్ కి కంగారు ఎక్కువైంది..!

vinaya vidheya rama shows stopped

రంగస్థలం సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటితో కలిసి వినయ విధేయ రామ అంటూ మాస్ మసాలా సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై మొన్నటి వరకు అంటే… ట్రైలర్ విడుదలయ్యే వరకు ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండేవి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వినయ విధేయ రామ ట్రైలర్ ని బోయపాటి పక్కా మాస్ మసాలతోనే కట్ చేసాడు. రామ్ చరణ్ ని మరీ మాస్ యాంగిల్ లో చూపెట్టాడు. అయితే ట్రైలర్ కి యూట్యూబ్ నుండి మంచి వ్యూస్ వచ్చాయి కానీ.. విమర్శకులు మాత్రం వినయ విధేయ రామ ట్రైలర్ మరీ ఊర మాస్ గా ఉంది.. బోయపాటిలో ఏ మార్పు లేదన్నారు.

ఆ సినిమాలతో పోల్చుకుంటే…

అయితే వినయ విధేయ రామ ట్రైలర్ చూసిన మెగా ఫాన్స్ మొదట్లో ఖుష్ అయినా… సంక్రాంతికి విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, పేట, ఎఫ్ 2 ట్రైలర్స్ చూసాక కాస్త కంగారు పడుతున్నారు. వినయ విధేయ రామ ట్రైలర్ మొత్తం మాస్ తోనే నిండిపోయింది. కానీ కథానాయకుడు ప్రేక్షకులు మెచ్చేదిగా… ఎఫ్ 2 కామెడీ ఎంటెర్టైనెర్ గా, పేట రజనీ మ్యానియాతో నిండిపోయింది. కానీ రామ్ చరణ్ లోని మాస్ యాంగిల్ ని మరీ ఎక్కువగా బోయపాటి చూపించేసాడేమో… అసలు చరణ్ ను మాస్ గా కన్నా… క్లాస్ లుక్ లోనే చూపిస్తే బాగుండేది. ఇప్పుడు ఈ మాస్ ట్రైలర్ తో సినిమా మీదున్న అంచనాలు ఎక్కడ తగ్గుతాయో అనే కంగారులో మెగా ఫాన్స్ లో కొట్టుమిట్టాడుతున్నారు.

క్లాస్ ట్రైలర్ ఒకటి వదలరూ…

మరి సినిమా విడుదలకు ఇంకా పది రోజులు టైం ఉంది కనక ఏదన్నా క్లాస్ యాంగిల్ లో ఒక ట్రైలర్ లాంటి టీజర్ వదిలితే బాగుంటుందని రామ్ చరణ్ కి మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారట. వినయ విధేయ రామ టైటిల్ కి, కట్ చేసిన ట్రైలర్ కి సంబంధమే లేదు.. అంటూ మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారట. మరి మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు బోయపాటి ఫస్ట్ లుక్ మాస్ యాంగిల్, సెకండ్ లుక్ క్లాస్ యాంగిల్ ని చూపించినట్టుగా… ఫస్ట్ ట్రైలర్ మాస్ గా, సెకండ్ ట్రైలర్ ని క్లాస్ గా ఎమైనా వదిలే ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*